Asianet News TeluguAsianet News Telugu

రాత్రిళ్లు సరిగ్గా నిద్రపట్టడం లేదా? అయితే మీరు పిస్తా పప్పులను తినాల్సిందే..!

నిద్రలేకపోవడం వల్ల శారీరక, మానసిక సమస్యలెన్నో వస్తాయి. రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం వల్ల ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. అయితే నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి పిస్తాపప్పులు మంచి మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. 
 

 Feeling insomniac? how pistachios will help you sleep better rsl
Author
First Published Mar 25, 2023, 2:41 PM IST


ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు. నిద్రపోవడానికి ముందు ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడం, హెవీగా భోజనం చేయడం వంటి వివిధ కారణాల వల్ల నేడు ఎంతో మంది నిద్రపోవడానికి ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె, కాల్షియం, మెగ్నీషియం వంటి కొన్ని ముఖ్యమైన పోషకాలు మీ శరీరంలో లోపించడం వల్ల కూడా రాత్రిళ్లు సరిగ్గా నిద్రపట్టదు. కొన్ని అధ్యయనాలు ఈ పోషకాలను తగినంతగా లేకపోవడం వల్లే నిద్ర పోవడంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నారని కనుగొన్నాయి.

గింజలు, విత్తనాలు, పండ్లు, కూరగాయలు వంటి ఎన్నో ఆహారాల్లో నిద్రను మెరుగుపరిచే విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పిస్తాపప్పులు నిద్రకు ఉత్తమమైన గింజలని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే వీటిలో ఎక్కువ మొత్తంలో మెలటోనిన్ ఉంటుంది. ఇది మీకు బాగా, ఎక్కువసేపు నిద్రపోవడానికి సహాయపడుతుంది.

పిస్తాపప్పుల్లో మెగ్నీషియం, విటమిన్ బి 6 ను కూడా ఉంటుంది. ఇవి నిద్రను ప్రోత్సహించడానికి సహాయపడతాయి. మెగ్నీషియం మీరు ప్రశాంతంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. అలాగే దీనిలో ఉండే విటమిన్ బి 6 మీ మానసిక స్థితిని స్థిరీకరించే 'హ్యాపీ హార్మోన్' అయిన సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచేందుకు సహాయపడుతుంది. పిస్తాపప్పులు శారీరక, మానసిక, స్వయం ప్రతిరక్షక రుగ్మతలను నయం చేయడానికి సహాయపడతాయి.

పిస్తా వల్ల కలిగే ప్రయోజనాలు

పిస్తాపప్పు శరీరానికి, మనస్సుకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఆందోళన, నిద్రలేమి, చెడు ఆహార కోరికలు, ఊబకాయంతో బాధపడేవారికి పిస్తాపప్పులు మంచి మేలు చేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. పిస్తాపప్పు ఆకలి, లైంగిక శక్తి, మానసిక స్థితి, నిద్రను కూడా మెరుగుపరుస్తుంది. హృదయనాళ వ్యవస్థకు మద్దతునిచ్చే అనేక పోషకాలను పిస్తాలో ఉంటాయి. ఇవి గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. 

గాఢ నిద్ర కోసం పిస్తా లను ఎప్పుడు తినాలి

మంచి నిద్ర కోసం మెగ్నీషియం, మెలటోనిన్ మాత్రలను వేసుకునే బదులు రాత్రి పడుకునే గంట ముందు గుప్పెడు పిస్తా పప్పులు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. పిస్తాపప్పులతో పాటు, బ్రాహ్మీ, అశ్వగంధ, జతమాన్సి, తగర్, శంఖపుష్పం వంటి ఆయుర్వేద మూలికలు ఒత్తిడిని తగ్గించి నిద్ర హాయిగా పట్టేలా చేస్తాయి.  అస్తవ్యస్తమైన నిద్ర, అతిగా ఆలోచించడం, ఆందోళనలు కూడా తగ్గిపోతాయి. ఈ మూలికలను పడుకునే ముందు పాలు లేదా నీటితో కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది.

కాబట్టి మాత్రలు వేసుకునే బదులు రాత్రి పడుకునే గంట ముందు గుప్పెడు పిస్తా పప్పులు తింటే ప్రశాంతంగా నిద్రపోవచ్చు. మీ మొత్తం ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios