కూర్చున్నప్రతిసారీ కాళ్లు ఊపే అలవాటు ఉందా..? ఏమౌతుందో తెలుసా?
మనం సరదాగా చేసే ఈ పని వల్ల... చాలా రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని మీకు తెలుసా..? కాళ్లు ఊపడం వల్ల.. మనకు తెలీకుండానే మనం కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటున్నామట
చాలా మందికి కాళ్లు ఊపే అలవాటు ఉంటుంది. ఎక్కడ ఉన్నాం.. ఏం చేస్తున్నాం.. మనం కూర్చున్న ప్లేస్ ఏంటి..? ఇలాంటివి ఏమీ చూడలేరు. ఆటోమెటిక్ కాళ్లు ఊగిపోతూ ఉంటాయి. మీకు కూడా ఆ అలవాటుు ఉంటే.. వెంటనే మానేయమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకో తెలుసుకోవాలి అనుకుంటే.. ఈ ఆర్టికల్ మొత్తం చదవాల్సిందే.
చాలా మంది కాళ్లు ఊపితే ఏమౌతుంది..? అనే ఎదురు ప్రశ్న వేస్తూ ఉంటారు. ఇంట్లో పెద్దవాళ్లు కాళ్లు ఊపకూడదు అని చెప్పినా కూడా వినకుండా.. అదే పనిగా ఊపుతూ ఉంటారు. కానీ.. మనం సరదాగా చేసే ఈ పని వల్ల... చాలా రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని మీకు తెలుసా..? కాళ్లు ఊపడం వల్ల.. మనకు తెలీకుండానే మనం కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటున్నామట. దీని వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు చూద్దాం...
శాస్త్రాల ప్రకారం కూడా కాళ్లు ఊపడం మంచిది కాదని చెబుుతారు. అలా కాళ్లు ఊపేవరు ఎప్పుడూ బద్దకంగా ఉంటారని, ధరిధ్రం వారి చుట్టూ తాండవిస్తూ ఉంటుంది అని అంటూ ఉంటారు. కానీ... వైద్య పరంగానూ దీనిని కారణాలు ఉన్నాయి. కొంత ఉపయోగం ఉంటే.. కొంత నష్టం కూడా ఉంది.
ముందు.. కాళ్లు ఊపడం వల్ల మనకు కలిగే అనుభూతులు చూద్దాం..
మీరు ఎక్కువసేపు ఒకే చోట కూర్చుంటే, కండరాల తిమ్మిరి వంటి శారీరక అసౌకర్యాన్ని అనుభవించవచ్చు. ఆ సమయంలో కాలు ఊపడం వల్ల ఈ భావాలన్నీ తగ్గిపోతాయి. అలాగే ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ పెరగడానికి, కండరాలు సాగడానికి, నరాలు ఉత్తేజితం కావడానికి సహాయపడుతుంది.
అంతేకాదు.. ాచలా మందికి కాళ్లు ఊపడం వల్ల ఒత్తిడి తగ్గిన అనుభూతి కలుగుతుంది. ఒత్తిడి , ఆందోళన కారణంగా ఒక వ్యక్తి వివిధ శారీరక ప్రభావాలను అనుభవించవచ్చు. ఉదాహరణకు, హృదయ స్పందన రేటు, చెమట , కండరాల ఒత్తిడి. అటువంటి పరిస్థితిలో, కాళ్లు ఊపడం వల్ల వారికి తెలియని ఓ ప్రశాంతత లభిస్తుంది. నీరసంగా ఉన్నప్పుడు, జలుబు చేసినప్పుడు కూడా.. ఇలా కాళ్లు ఊపడం వల్ల.. విసుగురాదు. బోర్ గా ఉన్నాం అనే ఫీలింగ్ కలగదు.
ఈ కాళ్లు ఊపడం వల్ల కలిగే నష్టాలు..
మీరు ఎల్లప్పుడూ కదలికలో ఉంటే, ఇతరుల దృష్టి మీపై ఉండదు. మీ నుండి దూరంగా ఉంటుంది. మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ పాదాలను కదిలిస్తే, మీ పట్ల ఎదుటి వ్యక్తికి ఉన్న గౌరవం పోతుందని గుర్తుంచుకోండి.
అదేవిధంగా, మీరు మీ పాదాలను ఎక్కువగా ఊపుతూ ఉంటే, మీరు పాదాల నొప్పి వంటి కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. అంతే కాకుండా, ఈ అలవాటు కీళ్ల నొప్పుల సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా, RLS ఉన్న వ్యక్తులు తమ పాదాలను ఎక్కువగా కదిలిస్తే వారి లక్షణాలను మరింత దిగజార్చుకునే అవకాశం ఉంది.
అలాగే, మీరు మీ పని ప్రదేశంలో లేదా బహిరంగ ప్రదేశాల్లో పొరపాట్లు చేస్తే, మీ వృత్తిపరమైన విషయాలు ప్రభావితమవుతాయి. కాబట్టి, ఈ అలవాటును వెంటనే మానేయండి. మీ ఫోకస్ పెంచుకోవడానికి మీరు ఒక పుస్తకాన్ని చదవవచ్చు, పాట వినవచ్చు లేదా మీ దృష్టిని వేరొకదానిపై కేంద్రీకరించవచ్చు.
మీరు మీ కాళ్ళను ఊపడం మానేయాలనుకుంటే, మీ కాళ్ళను ఊపడానికి బదులుగా, మీ పాదాలను టేబుల్ మీద ఉంచండి. అలాగే, మీ కాళ్లలో ఏదైనా నొప్పి లేదా అసౌకర్యాన్ని అనుభవిస్తే, కొద్ది దూరం నడవడం మంచిది. ఇది మీ రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. మీ కాళ్ళపై ఒత్తిడిని తగ్గిస్తుంది. కాబట్టి.. వీలైనంత వరకు ఈ కాళ్లు ఊపే అలవాటు మార్చుకుంటేనే మంచిది.
- Leg Shaking Habit While Sitting
- Leg shaking habit
- effects of swinging the legs
- health problems
- health tips
- how to control the leg shaking habit
- iron deficiency
- leg pain
- leg shaking habit is good or bad
- leg shaking habit while sitting
- legs shaking
- nutritional deficiency
- physical deficiency
- restless leg syndrome
- shaking leg habit
- shaking legs while sitting
- tips to stop this habit