మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం చాలా ప్రమాదకరం. అందుకే ఎప్పటికప్పుడు మధుమేహులు బ్లడ్ షుగర్ లెవెల్స్ ను చెక్ చేస్తూ ఉండాలి. అయితే మధుమేహులు క్రమం తప్పకుండా ఒక పనిచేస్తే రక్తంలో చక్కెర పెరిగి అవకాశమే ఉండదంటున్నారు నిపుణులు. అదేంటంటే..
మన దేశంలో రోజు రోజుకు మధుమేహుల సంఖ్య పెరిగిపోతోందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఈ మధుమేహంతో బాధపడుతున్నారు. టైప్ 2 డయాబెటీస్ కు ప్రధానం కారణం మన జీవన శైలేనని నిపుణులు చెబుతున్నారు. ఈ డయాబెటీస్ వల్ల మన శరీరం ఇన్సులిన్ ను సరిగ్గా ఉపయోగించదు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచుతుంది.
తినే ఆహారం, జీవన శైలి వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. ఈ వ్యాధి ప్రాణాంతకం కూడా. అందుకే డయాబెటీస్ పేషెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. షుగర్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండాలంటే మీరు తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. ముఖ్యంగా మధుమేహులు చక్కెరతో తయారుచేసిన తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. అయితే ఒక్క షుగర్ మాత్రమే కాదు బ్లడ్ షుగర్ ను పెంచే ఆహారాలు ఎన్నో ఉన్నాయి. అందుకే మీరు ట్రాన్స్ ఫ్యాట్స్, ఎక్కువ కేలరీలు, సంతృప్త కొవ్వు లు ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోకూడదు.
డయాబెటీస్ పేషెంట్లు ఒక్క ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండటమే కాదు.. శారీరకంగా చురుకుగా ఉండటం చాలా ముఖ్యం. అందుకే ప్రతిరోజూ వ్యాయామం చేయండి. వ్యాయామం చేయకపోతే ఉదయం, సాయంత్రం వేళల్లో నడవండి. శరీరక శ్రమ చేస్తేనే మీరు రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. డాక్టర్ సలహా తీసుకుని వ్యాయామాలను చేయండి.
పనిలో పడి చాలా మంది మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తుంటారు. కానీ ఇలా ఆహారాన్ని తినకపోవడం వల్ల కూడా మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. మీకు తెలుసా ఉదయం తినకపోవడం వల్ల ఎన్నో ఇతర సమస్యలు కూడా వస్తాయి. అందుకే ఎప్పటికప్పుడు ఏదో ఒకటి తింటూ ఉండండి. అలా అని ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాలను అసలే తినకూడదు.
షుగర్ పేషెంట్లు కూల్ డ్రింక్స్ ను తాగకూడదు. ఎందుకంటే ఇవి మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచేస్తాయి. అందుకే వీటికి బదులుగా కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, కూరగాయల రసం వంటి ఆరోగ్యకరమైన పానీయాలనే తాగండి. ఇవి మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచడమే కాదు ఆరోగ్యంగా ఉంచుతూ.. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. సోడా లేదా తీయగా ఉండే ఇతర పానీయాలను తాగితే బ్లడ్ షేగర్ లెవెల్స్ పెరుగుతాయి. అందుకే ఇలాంటి వాటికి మధుమేహులు దూరంగా ఉండాలి.
డయాబెటీస్ పేషెంట్లు పండ్ల రసాలను కూడా తాగకూడదు. ఎందుకంటే వీటిలో కూడా చక్కెర ఎక్కువగా ఉంటుంది. వీటిని తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఒకవేళ పండ్ల రసాలను తాగాలనుకుంటే షుగర్ లేకుండా ఇంట్లోనే తయారుచేసుకుని తాగండి.
షుగర్ పేషెంట్ల ఆరోగ్యానికి ఆల్కహాల్ కూడా అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ను అమాంతం పెంచుతుంది. ఎందుకంటే దీనిలో చక్కెర, పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇది హైపోగ్లైసీమియాకు కూడా దారితీస్తుంది. ఈ హైపోగ్లైసీమియా వల్ల ప్రాణాలు కూడా పోవచ్చు. అందుకే మధుమేహులు వైన్, బీర్లను ఎక్కువగా తాగకూడదు. ముఖ్యంగా మెడిసిన్ తీసుకునే వారు ఆల్కహాల్ కు మొత్తమే దూరంగా ఉండాలని డాక్టర్లు సలహానిస్తున్నారు.
