Asianet News TeluguAsianet News Telugu

పరగడుపున మెంతుల నీరు తాగితే..

విటమిన్ సి, బి1, బి2, కాల్షియం వంటి శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. అవకాశం ఉందని చెబుతున్నారు. కేవలం షుగర్ పేషెంట్స్ కి  షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉండటమే కాకుండా.. చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
 

Diabetes Diet: Fenugreek (Methi) Water May Help Regulate Blood Sugar Levels
Author
Hyderabad, First Published Nov 18, 2020, 2:48 PM IST

మెంతులు.. రుచికి చేదుగా ఉంటాయి. కానీ ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలా ఉంటాయి. ఎన్నో రోగాలను ఇట్టే మాయం చేసే శక్తి మెంతులకు ఉంది. అందుకే మన పూర్వీకులు వంటలో మెంతులు ఎక్కువగా ఉపయోగించేవారు. అయితే.. ఈ మధ్యకాలంలో చాలా మంది మెంతుల వాడకాన్ని తగ్గించేశారు. అయితే.. మళ్లీ మెంతులు వాడకం మొదలుపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ మెంతులు కచ్చితంగా వాడాలట. ప్రతిరోజూ మెంతులు నానపెట్టిన నీరు తాగితే.. ఆరోగ్యానికి మంచిదని.. అంతేకాకుండా.. షుగర్ లెవల్స్ కంట్రోల్లోకి వచ్చేమెంతుల్లో పీచు పదార్థాలు, ఇనుము, 
విటమిన్ సి, బి1, బి2, కాల్షియం వంటి శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. అవకాశం ఉందని చెబుతున్నారు. కేవలం షుగర్ పేషెంట్స్ కి  షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉండటమే కాకుండా.. చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

జీర్ణ సమస్యలతో బాధపడేవారు మెంతులను తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. మెంతులను నానబెట్టి ఆ నీరు తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. రాత్రిపూట ఓ గ్లాస్ నీటిలో టీ స్పూన్ పరిమాణంలో మెంతులను నానబెట్టి ఉదయాన్నే వాటిని తాగాలి. ఇలా తాగడం వల్ల మలబద్ధకం, జీర్ణసమస్యలు తగ్గుతాయి. అంతేకాదు గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా తగ్గుతాయి.

అధిక బరువుతో బాధపడేవారు తరచు మెంతులు తీసుకుంటే బరువు తగ్గుతారు. 1 టీ స్పూన్ మెంతులు రాత్రివేళ నీటిలో నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ఆ నీటిని మాత్రం తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం, తేనె కలిపి తాగితే శరీరంలోని చెడు వ్యర్థ పదార్థాలన్నీ తొలగిపోతాయి. దాంతోపాటు ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటుంది.

బాలింతలు ఈ మెంతులను నేరుగా తీసుకున్నా, పొడి రూపంలో తీసుకున్నా పాల ఉత్పత్తి పెరుగుతుంది.మెంతులతో కషాయం చేసుకుని తాగినా, మెంతికూర పప్పు ఎక్కువగా తిన్నా బాలింతల్లో పాలు ఉత్పత్తి మెరుగవుతుంది.

ప్రతి రోజు రాత్రిపూట 2 స్పూన్ల మెంతులను నీటిలో నానబెట్టి ఉదయం వాటిని మెత్తగా పేస్టు చేసి దానికి ఒక స్పూన్ పెరుగును కలిపి తలకు బాగా పట్టించి అర్థగంట ఆగిన తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గడమే కాకుండా జుట్టు ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది. ఇలా వారానికి మూడుసార్లు చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు.

టీ స్పూన్ మెంతులు రాత్రివేళ నీటిలో నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల చర్మం ముడతలు, నలుపు వలయాలను అడ్డుకుంటాయి. స్కిన్ టోన్‌ను తేలికపరిచే గుణం మెంతులకు ఉంది.
మెంతుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, పీచు పదార్థాలు కడుపునొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు రోజూ క్రమం తప్పకుండా మెంతుల నీటిని తాగితే వ్యాధులు అదుపులో ఉంటాయి. అలానే రక్తం గడ్డకట్టడం, గుండెపోటు వంటి సమస్యల్ని కూడా నియంత్రిస్తాయి.


షుగర్ వ్యాధితో బాధపడేవారు మెంతుల నీటిని రెగ్యులర్‌గా తాగడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది. కాబట్టి షుగర్‌తో బాధపడేవారు రెగ్యులర్‌గా ఈ నీటిని తాగడం వల్ల చాలా వరకూ డయాబెటీస్ కంట్రోల్ అవుతుందని వైద్యులు చెబుతున్నారు.
నాలుగు చెంచాల మెంతులను రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయం ఆ నీటిని తలకు పట్టించి అరగంట సేపటి తర్వాత తలస్నానం చేస్తే మెంతులలో ఉండే పొటాషియం తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios