Asianet News TeluguAsianet News Telugu

కరోనా కాలం ఇది... మాస్క్ ఎలా వాడాలో తెలుసా..?

ఒక మాస్క్‌ను రెండు మూడు సార్లు వాడిన తరువాతగానీ ఉతకకపోవడం, వాటి మీద శానిటైజర్‌ స్ర్పే చేయడం వంటివి చాలామంది చేస్తుంటారు. కానీ అది సరికాదు. మాస్క్‌ ధరిస్తున్నప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి... 

Coronavirus How to Care for Your Face Mask
Author
Hyderabad, First Published Jun 30, 2020, 2:46 PM IST

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ ఎంతలా విలయతాండవం చేస్తోందో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఈ వైరస్ మన దరిదాపుల్లోకి రాకుండా ఉండాలంటే.. వ్యక్తిగత శుభ్రత పాటించక తప్పదు. దీనిలో భాగంగా ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టాలంటే.. మూతికి మాస్క్ తప్పనిసరి.

అయితే.. రక్షణ కోసం మాస్క్‌ ధరించడం ఎంత ముఖ్యమో దాన్ని శుభ్రం చేయడం కూడా అంతే ముఖ్యం. అయితే ఒక మాస్క్‌ను రెండు మూడు సార్లు వాడిన తరువాతగానీ ఉతకకపోవడం, వాటి మీద శానిటైజర్‌ స్ర్పే చేయడం వంటివి చాలామంది చేస్తుంటారు. కానీ అది సరికాదు. మాస్క్‌ ధరిస్తున్నప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి... 

రోజూ ఉతకండి: ఫేస్‌ మా్‌స్కను వారానికి ఒకసారి శుభ్రం చేస్తున్నారంటే మిమ్మల్ని మీరు ప్రమాదంలోకి నెట్టుకుంటున్నట్టే. మాస్క్‌ ధరించిన ప్రతిసారి దాన్ని శుభ్రం చేయాలి. 

Coronavirus How to Care for Your Face Mask

డిజ్‌ ఇన్‌ఫెక్టంట్స్‌ చల్లకండి: క్లాత్‌ ఫేస్‌మాస్క్‌ మీద డిజ్‌ఇన్‌ఫెక్టంట్‌ స్ర్పే చేసి శుభ్రం చేయడం సరైంది కాదు. డిజ్‌ ఇన్‌ఫెక్టంట్‌ మాస్క్‌ మీది క్రిములను చంపుతుంది. కానీ మాస్క్‌ పెట్టుకున్నాక శ్వాస తీసుకునేటప్పుడు డిజ్‌ ఇన్‌ఫెక్టంట్‌ గాఢత, వాసన ఇబ్బందిగా అనిపిస్తుంది. అంతేకాదు ముక్కు, నోరు, గదవ దగ్గరి చర్మం దురద, మంటగా అనిపిస్తుంది. 

చల్లని నీళ్లతో ఉతకవద్దు: మాస్కులను చన్నీటిలో శుభ్రం చేస్తుంటారు కొందరు. అలాకాకుండా వేడినీళ్లతో మాస్కులను శుభ్రం చేయడం అన్ని విధాలా మేలు. 

మాస్కుల శుభ్రత ఇలా...  

వస్త్రంతో చేసిన మాస్కులను వాషింగ్‌ మిషన్‌లో వేడినీళ్లు లేదా సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు శుభ్రం చేయాలి. తరువాత ఎండలో లేదా డ్రయ్యర్‌ను హై హీట్‌ మోడ్‌లో ఉంచి ఆరబెట్టాలి. చేత్తో ఉతికి ఎండలో కూడా ఆరబెట్టవచ్చు. 

Follow Us:
Download App:
  • android
  • ios