శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచి లైంగిక ఆరోగ్యం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. అయితే వయసు పెరుగుతున్న మహిళల్లో ముఖ్యంగా 50 ఏండ్లు పైబడిన ఆడవారికి కొన్ని లైంగిక సమస్యలు ఎక్కువ వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
వయసు పెరుగుతున్న కొద్దీ ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుకుంటాయి. ముఖ్యంగా 50 ఏండ్లు పైబడిన ఆడవారికి లేని పోని రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. వీటిలో లైంగిక సమస్యలు ఎక్కువగా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వయసేదైనా మంచి లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యం ముఖ్యం. ఎందుకంటే సెక్స్ ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. అయితే 50 ఏండ్లు పైబడిన వారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ వయసులోనే లైంగిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అవేంటంటే..
అండాశయ క్యాన్సర్
రుతుక్రమం ఆగిపోయిన మహిళలకు రొమ్ము క్యాన్సర్ రావడం ఎంత సర్వ సాధారణమో.. .అండాశయ క్యాన్సర్ రావడం కూడా అంతే సాధారణం. గర్భాశయ క్యాన్సర్ ఈ వయస్సులోని మహిళలను ప్రభావితం చేసే మరొక సాధారణ క్యాన్సర్ రకమని నిపుణులు అంటున్నారు. ఈ క్యాన్సర్ రాకుండా ఉండేందుకు ఉత్తమ మార్గం తరచుగా టెస్ట్ లు చేయించుకోవడం. ఈ సమస్యల అవకాశాలను తగ్గించడానికి రొటీన్ క్యాన్సర్ స్క్రీనింగ్ తప్పనిసరి. సెక్సువల్ మెడిసిన్ జర్నల్ లో ప్రచురించిన 2019 అధ్యయనం ప్రకారం.. అండాశయ క్యాన్సర్ ఉన్న మహిళలు సెక్స్ సమయంలో నొప్పి, లైంగిక కోరికలను కోల్పోవడం, భావప్రాప్తి మార్పులు వంటి సమస్యలు వస్తాయి.
గర్భాశయ ముఖ క్యాన్సర్
మహిళలుకు సోకే మరో రకం క్యాన్సర్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. ఈ క్యాన్సర్ కణాలు ఏర్పడటాన్ని గుర్తించడానికి మహిళలు పాప్ పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలి. అయితే గర్భాశయ క్యాన్సర్ సోకితే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అందులో కొన్ని రుతువిరతి తర్వాత రక్తస్రావం, దుర్వాసన కలిగిన ఉత్సర్గలు ఉన్నాయి. అయితే ఈ అసాధారణ కణాలను గుర్తించినట్టైతే మంచి వైద్యంతో దీన్నిపూర్తిగా తగ్గించుకోవచ్చు.
గర్భాశయ క్యాన్సర్
50 ఏళ్లు దాటిన మహిళల్లో సర్వసాధారణమైన మరో రక్ క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్. ఈ క్యాన్సర్ అత్యంత సాధారణ లక్షణం రుతువిరతి తర్వాత రక్తస్రావం కావడం. అయితే రోగ నిర్ధారణ చేయడానికి ఎండోమెట్రియల్ నమూనా అవసరం. రోగ నిర్ధారణ పొందడానికి పైపెల్ ఆస్పిరేషన్, ఎండోమెట్రియల్ బయాప్సీ చేయొచ్చు. మరిన్ని పరీక్షలు కూడా దీనికి అవసరం కావొచ్చు.
లిబిడో తగ్గడం
రుతువిరతి తర్వాత ఈస్ట్రోజెన్ స్థాయిలు బాగా పడిపోతాయి. ఇది కొన్నిసార్లు యోని పొడిబారడం, అసౌకర్య శృంగారానికి దారితీస్తుంది. లిబిడో తగ్గితే సెక్స పై కోరికలు రావు. లిబిడో తగ్గడానికి ఇతర కారణాలు..
డయాబెటిస్, హైపర్ టెన్షన్, క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలు
కొన్ని యాంటిడిప్రెసెంట్స్
ఆల్కహాల్, ధూమపానం వంటి కొన్ని జీవనశైలి అలవాట్లు
అయితే లిబిడో తక్కువగా ఉన్న చాలా మంది మహిళలు రుతువిరతి తర్వాత చాలా కాలంపాటు చురుకైన లైంగిక జీవితాన్ని కలిగి ఉంటారు. కానీ లిబిడో తక్కువగా ఉండటం వల్ల భవిష్యత్తులో నిరాశ, ఆందోళనకు కారణం కావొచ్చు. లిబిడో తగ్గడం వల్ల హైపోయాక్టివ్ లైంగిక రుగ్మత కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
యోని ఆకారంలో మార్పులు
రుతువిరతి సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గుతాయి. ఈస్ట్రోజెన్ యోని తేమగా, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. ఈస్ట్రోజెన్ల తగ్గుదల వల్ల యోని పొడి బారుతుంది. అలాగే ఇరుగ్గా కూడా మారుతుంది. సెక్స్ సమయంలో యోని పొడిబారితే చికాకు కలుగుతుంది.
