Asianet News TeluguAsianet News Telugu

షుగర్‌ పేషెంట్స్‌ కొబ్బరి నీళ్లు తాగొచ్చా.. డాక్టర్స్‌ సలహా ఏంటంటే..

కొబ్బరి నీళ్లు.. ఇన్‌స్టెంట్‌ ఎనర్జీనిచ్చే నాణ్యమైన పానీయం. కాస్త నీరసంగా ఉంటే వెంటనే శక్తి పొందడానికి కొబ్బరి నీళ్లు చాలా ఉపయోగపడతాయి. మరి షుగర్‌ పేషెంట్స్‌ కొబ్బరి నీళ్లు తాగొచ్చా.. దీనికి డాక్టర్స్‌ ఏం సలహాలు ఇస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
 

Can Diabetics Drink Coconut Water? Doctor's Advice on Sugar Patients sns
Author
First Published Aug 26, 2024, 3:04 PM IST | Last Updated Aug 26, 2024, 3:04 PM IST

భారత దేశ ప్రజలు టైప్‌ 2 మధుమేహానికి ఎక్కువగా గురవుతున్నారని ఓ సర్వే ద్వారా తెలుస్తోంది. జన్యు పరంగా మన దేశ ప్రజలు సంపూర్ణ ఆరోగ్యవంతులైనప్పటికీ ఆహారం తీసుకోవడంలో వచ్చిన మార్పుల వల్ల షుగర్‌ వ్యాధికి గురవుతున్నారు. మన దేశంలో ఈ చక్కెర వ్యాధి చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోందని ప్రభుత్వ అధికారులే చెబుతున్నారు. మరి ఇలాంటి షుగర్‌ పేషెంట్లు కొబ్బరి నీళ్లు తాగడంపై డాక్టర్లు పలు సూచనలు చేస్తున్నారు. 

కొబ్బరి నీళ్లు రిఫ్రెష్‌ డ్రింక్‌
కొబ్బరి నీళ్లు సహజంగానే రిఫ్రెష్‌ డ్రింక్‌. ఇందులో చక్కర స్థాయిలు తక్కువగా ఉంటాయి. 200 ml కొబ్బరి నీళ్లలో 40-50 కేలరీలు,10 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి. ఇవి డైజేషన్‌ను వేగవంతం చేస్తాయి. అందువల్ల మామూలు వ్యక్తులు కొబ్బరి నీళ్లు తరచూ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే మరి షుగర్‌ పేషెంట్స్‌ తాగొచ్చా అంటే.. తాగొచ్చని చెబుతున్నారు వైద్యులు. అయితే పరిమిత మోతాదులోనే తీసుకోవాలని సూచిస్తున్నారు. 

కొబ్బరి నీళ్లు తాగితే ప్రయోజనాలు..
కొబ్బరి నీళ్లు తరచూ తాగితే బరువు తగ్గవచ్చు. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. వెంటనే శక్తినిస్తాయి. ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుంది. కొబ్బరి నీళ్లలో బయోయాక్టివ్ ఎంజైమ్‌లు కూడా ఉంటాయి. ఇవి జీర్ణక్రియలో సహాయపడతాయి. కొబ్బరి నీళ్లను రోజుకు కనీసం 3-4 సార్లు తాగడం వల్ల ఆటోమెటిక్‌గా శరీరం బరువు తగ్గుతుంది. 

పొటాషియం, హైడ్రేట్లు అధికం..
కొబ్బరి నీళ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది వెంటనే ఎనర్జీనిస్తుంది. అందువల్ల అలసటగా ఉన్న వారు కొబ్బరి నీళ్లు తాగితే వెంటనే శక్తిని పొందుతారు. అదేవిధంగా హైడ్రేట్లు శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడతాయి. ఎప్పుడైన డీహైడ్రేట్‌ అయినప్పుడు కొబ్బరి నీళ్లు తాగితే వెంటనే ఫలితం కనిపిస్తుంది. 

షుగర్‌ పేషెంట్లు కొబ్బరి నీళ్లు తాగొచ్చా..
రక్తంలో షుగర్‌ లెవెల్స్‌ కంట్రోల్‌లో లేని వారు తప్పకుండా కొబ్బరి నీళ్లు తాగొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. అయితే పరిమిత మోతాదులోనే తాగాలట. షుగర్‌ ప్రాబ్రమ్‌ ఉన్న వారు కేవలం 200 ఎంఎల్‌ కొబ్బరినీళ్లు మాత్రమే తాగాలట. అంతకు మించి తాగితే ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios