ఊపిరితిత్తులు ఆక్సిజన్ ను ఫిల్టర్ చేస్తాయి. ఆ తర్వాతే ఆక్సిజన్ మన శరీరంలోని ప్రతి భాగానికి వెళుతుంది. కాగా మన ఊపిరితిత్తులకు ఏ సమస్య వచ్చినా.. శ్వాసకు సంబంధించిన సమస్యలు వస్తాయి. అందుకే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహారాలను తప్పకుండా తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

మన శరీరంలో అతి ముఖ్యమైన భాగాల్లో ఊపిరితిత్తులు ఒకటి. ఊపిరితిత్తులు ఫిల్టర్ చేసిన తర్వాతే ఆక్సిజన్ శరీరం మొత్తం సరఫరా అవుతుంది. అందుకే మన ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. వాయు కాలుష్యం, స్మోకింగ్, దుమ్ము, ధూళి వంటివి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అంతేకాదు వీటివల్ల న్యూమోనియా, క్యాన్సర్, టీబీ, ఆస్తమా వంటి ప్రమాదకరమైన రోగాలు వస్తాయి. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే హెల్తీ ఫుడ్ ను తినాలి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని ఆహారాలు ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అవేంటంటే.. 

వాల్ నట్స్

మారికాన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్ నుంచి ప్రచురించబడిన ఒక జర్నల్ ప్రకారం.. వాల్ నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ గుప్పెడు వాల్ నట్స్ ను తింటే మీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఆస్తమా, శ్వాసకోశ సమస్యలను తగ్గించడానికి కూడా వాల్ నట్స్ సహాయపడతాయి. 

ఫ్యాటీ ఫిష్

మంచి కొవ్వులు ఎక్కువగా ఉండే చేపలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ ఫ్యాటీ ఫిష్ లను తినడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ చేపల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. 

బెర్రీలు

బ్లాక్ బెర్రీ, బ్లూ బెర్రీ, రాస్ బెర్రీలు అంటూ బెర్రీలు ఎన్నో రకాలు ఉంటాయి. మీరు ఎలాంటి బెర్రీలను తిన్నా.. మీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. బెర్రీలలో విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మీ శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. 

బ్రోకలి

బ్రోకలీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బ్రోకలీని తింటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. బ్రోకలీ కూడా మీ శరీర శక్తి స్థాయిలను పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. 

అల్లం

అల్లంలో యాంటీ ఇన్ప్లమేటరీ లక్షణాలు ఉంటాయి. అంతేకాదు ఈ అల్లం మీ ఊపిరితిత్తులను కాలుష్యం నుంచి రక్షిస్తుంది. అల్లాన్ని తింటే ఆక్సిజన్ సరఫరా మెరుగ్గా జరుగుతుంది. అల్లం ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. 

ఆపిల్

రోజుకో ఆపిల్ పండును తింటే మీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఆపిల్ పండ్లలో ఊపిరితిత్తులకు మేలు చేసే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో విటమిన్ సి, విటమిన్ ఇ, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. సిట్రస్ పండ్లు కూడా మీ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి.