Asianet News TeluguAsianet News Telugu

ఎండాకాలంలో విటమిన్ సి ఎక్కువగా ఈ పండ్లను ఖచ్చితంగా తినండి.. లేదంటే?

ఎండాకాలంలో విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలను ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే ఇవి మన శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి రక్షిస్తాయి. ఇవి ఆరోగ్యాన్నే కాదు చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

add vitamin c foods to summer diet rsl
Author
First Published Mar 30, 2023, 4:35 PM IST

విటమిన్ సి మన శరీరానికి చాలా  చాలా అవసరం. ఎందుకంటే విటమిన్ సి ఎన్నో రకాల వ్యాధులను నివారించడానికి, మన రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో సహాయపడతాయి. అందుకే విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వేసవిలో విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలను ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది నిర్జలీకరణాన్ని నివారించడానికి, శరీరం, చర్మం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. మరి వేసవిలో ఎలాంటి పండ్లను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

నారింజ

నారింజలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి తెలుసా..? నారింజ సిట్రస్ పండు. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయని అందరికీ తెలుసు. అందుకే నారింజను మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీ ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. వేసవిలో నారింజ తినడం వల్ల చర్మ ఆరోగ్యం బాగుంటుంది. 

కివిలు

కివీలను తినేవారు తక్కువే. కానీ ఈ పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లలో ఫోలేట్, పొటాషియం, విటమిన్ కె, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. కివిని క్రమం తప్పకుండా  తినడం వల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. 

నిమ్మకాయ

నిమ్మకాయతో మన ఆరోగ్యానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదు. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. కాబట్టి వేసవిలో ఖచ్చితంగా నిమ్మరసాన్ని తాగండి. 

బొప్పాయి

బొప్పాయి ఎన్నో రోగాలను తగ్గిండంతో పాటుగా చర్మాన్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. బొప్పాయిలో విటమిన్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కె లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios