చంద్రబాబుపై వెంటనే కేసులు నమోదు చేయాలి...లేదంటే: ఎంపి సురేష్
అమరావతి ప్రాంత ప్రజల్ని రెచ్చగొట్టి రాష్ట్రంలో అశాంతిని సృష్టించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని... వెంటనే ఆయన్ని అరెస్ట్ చేసి రాష్ట్రాన్ని కాపాడాలని ఎంపీ నందిగం సురేష్ పోలీసులకు సూచించారు.
తాడేపల్లి: వైయస్సార్ కాంగ్రెస్ ఎంఎల్‌ఏలపై దాడులకు కారణం చంద్రబాబేనని ఎంపీ నందిగం సురేష్ ఆరోపించారు. ఒక ఫ్యాక్షనిస్ట్ గా,దుర్మార్గమైన వ్యక్తిగా ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని ఈయన చూస్తున్నారని అన్నారరు. అందులో భాగంగానే మంగళవారం వైసిపి ఎంఎల్‌ఏలపై దాడి చేయించారని... వారు కారు దిగిఉంటే అంతమొందించేందుకు కూడా వెనకాడి ఉండేవారు కాదని ఆరోపించారు.
రాజధాని రైతులు భూములు కోసం పోరాటమైతే.... ఉత్తరాంధ్ర,రాయలసీమవాసులు అందరం బాగుండాలని పోరాటం చేస్తున్నారన్నారు. చంద్రబాబు మాత్రం ఆయన దోచుకున్న సొమ్ము కోసం పోరాటం చేస్తున్నట్లు ఉందన్నారు. చంద్రబాబు గారు ఎలాంటి వ్యక్తో ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాటలు వింటే అర్దమవుతుందన్నారు.
బంద్,ధర్నా చేస్తే ఓ కారైనా తగలబడలేదా?బస్సైనా తగలబడలేదా? ఓ అద్దం కూడా పగలలేదా అని చంద్రబాబు అన్న సందర్భాలు ఉన్నాయని వెంటేశ్వరరావు స్వయంగా చెప్పారని అన్నారు. గతంలో ఎన్టీఆర్ కూడా చంద్రబాబును ఔరంగజేబుతో పోల్చిన సందర్భాలు కోకోల్లలుగా వున్నాయన్నారు.
read more జగన్ భార్య, తల్లీ, చెల్లి ఇప్పుడేమయ్యారు...: నిలదీసిన దివ్యవాణి
విశాఖను అభివృద్ది చేస్తే వచ్చేనష్టం ఏంటో, కర్నూలులో హైకోర్టు ఏర్పాటుచేస్తే చంద్రబాబుగారికి వచ్చే నష్టం ఏంటో తెలియటం లేదన్నారు. జగన్ నిర్ణయంతో బేంబేలెత్తిపోయి ఓ ప్రాంత నాయకుడుగానో ఒక కుల నేతగానో మిగిలిపోయాడంటే చంద్రబాబు నిజంగా సిగ్గుపడాలన్నారు. సిగ్గు,శరం వదలివేసి రాజధాని ప్రాంత రైతుల్ని రెచ్చగొట్టి, ఉద్రేక పరిచి దుర్మార్గమైన,హేయమైన చర్యలు చేపట్టాలని చంద్రబాబు భావిస్తున్నారని అన్నారు.
అమరావతి రైతులను ఎలా ఆదుకోవాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి,ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారికి బాగా తెలుసని చంద్రబాబు చెబితే నేర్చుకునే పరిస్దితి లేదన్నారు. ఖచ్చితంగా వారందరికి కూడా మెరుగైన అభివృధ్ది చూపిస్తామని... వారిని వదిలేసుకునే పరిస్దితి లేదన్నారు. ఒక వ్యక్తి బాధపడితేనే జగన్ ఊరుకోరు అలాంటిది 29 గ్రామాల ప్రజలు బాధపడుతుంటే చూస్తూ ఊరుకుంటారా..వారికి తగినవిధంగా మెరుగైన న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
read more జగన్ కు కళ్లద్దాలు, వినికిడి యంత్రం కానుక...: బుద్దా వెంకన్న
అమరావతి ధర్నాలలోకి టిడిపినేతలు, గూండాలు చొరబడి దాడులకు తెగబడి రోజు రోజుకు ఉధృతం చేస్తున్నారని... ఇలా పబ్బం గడుపుకునే విధంగా చంద్రబాబు తయారయ్యాడని మండిపడ్డారు. ఖచ్చితంగా చంద్రబాబుపై విచారణ జరపాలని... ఇలాంటి అల్లర్లు సృష్టించి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబుపై కేసు నమోదు చేసి విచారణ చేయాలనుకుంటున్నానని... ఆ భాధ్యత ప్రభుత్వం,పోలీసు యంత్రాంగం పై ఉందన్నారు.