అమరావతి: గత ఐదు రోజుల నుండి అసెంబ్లీలో టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు వ్యవహారశైలిని ప్రజలు గమనిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. సభలో సోమవారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ విభజనకు బిల్లు ప్రవేశ పెడితే చంద్రబాబు చర్చల్లో పాల్గొనకుండా పారిపోవడం దారుణమన్నారు. దీన్నిబట్టే ఆయనకు దళితులపై ఎంత ప్రేముందో అర్ధం అవుతోందన్నారు. 

రాష్ట్రం ఎస్సీ, ఎస్టీ లకు చెందిన నియోజకవర్గాల్లో కేవలం టీడీపీ కి ఒక్క సీట్ తప్ప మిగిలిన అన్ని సీట్లు వైసీపీ కి వచ్చాయని గుర్తుచేశారు. దీన్నిబట్టి దళితులకు జగన్ మీద ఎంత ప్రేముందో అర్ధం అవుతోందని అన్నారు. చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు ఎస్సీలకు సరయిన గౌరవం ఇవ్వలేదని...అందుకనే వైసిపి ప్రభుత్వం దళితులకు గౌరవం ఉండాలని ఈ చట్టం తెచ్చామన్నారు.

విశ్వవిద్యాలయాల్లో చైర్మన్ లకు పవర్ లేకుండా చేసి.... మొత్తం వైస్ చైర్మన్ కు పవర్ లు ఇచ్చి చంద్రబాబు అధికారం అంతా తన చేతుల్లో పెట్టుకున్నాడని అన్నారు. కానీ జగన్ ప్రభుత్వం విశ్వవిద్యాలయాలలో సమూలమైన మార్పులు తేవడానికి చట్టం తెచ్చారన్నారు. నీరు చెట్టు కార్యక్రమంలో భారీ అవినీతి జరిగిందని... దానిమీద విజిలెన్స్ విచారణ జరుగుతోందని నాగార్జున  వెల్లడించారు. 

read more  ఏపీకి మూడు రాజధానులు వచ్చే ఛాన్స్: అసెంబ్లీలో జగన్

మరో వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ... ఈ రోజు శాసనసభ లో ఉపాధి పనులు గురించి ప్రతిపక్షాలు నానా యాగీ చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో రూ.5180 కోట్లను టీడీపీ కార్యకర్తలు బొక్కేసారని ఆరోపించారు. సుమారు 4 వేల కోట్లు నీరు చెట్టు క్రింద కేంద్రంకు సంబంధం లేకుండా కేటాయించి అవినీతికి పాల్పడ్డారని అన్నారు. 

ఇప్పటికి గత ప్రభుత్వానికి చెందిన 11 వందల కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయని గుర్తుచేశారు. వైసిపి ప్రభుత్వం ఈ బిల్లులను దశలవారీగా 500 కోట్లు విడుదల చేసిందన్నారు. గత ప్రభుత్వంలో జరిగన అవకతవకలపై ఆడిట్ మరియు విజిలెన్స్ విచారణ జరుగుతోందని...తప్పుడు లెక్కలు చూపిన ఉద్యోగస్తులు విచారణకు భయపడి ఇప్పటికే కొంత డబ్బు తిరిగి కడుతున్నారన్నారు. 

మిషన్ల ద్వారా పని చేసినా వాటికి వీరు డబ్బులు డ్రా చేశారని అన్నారు.  టీడీపీ నేతలు ఢిల్లీకి వెళ్లి ముగ్గురు ఎంపీల ద్వారా కేంద్రానికి నరేగా మీద కంప్లెయింట్ చేయించారని ఆరోపించారు. 

read more వైద్యారోగ్య శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ: అసెంబ్లీలో వైద్య మంత్రి ప్రకటన

రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని చూస్తున్న చంద్రబాబు విధానాన్ని కండిస్తున్నామన్నారు. నీరు చెట్టు క్రింద అవినీతిని బయటకు తీసి వెంటనే వారిని శిక్షించాలని ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్ ను కోరుతున్నట్లు ధర్మశ్రీ వెల్లడించారు.