దళితులు ఎదిగితే ఒర్చుకోలేడు: బాబుపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబుకు దళితులు అభివృద్ది చెందడం ఇష్టం లేదని.. క్షమాపణలు చెప్పకపోతే పల్లెల్లోకి ప్రతిపక్షనేతను అడుగుపెట్టనీయమని మేరుగ నాగార్జున హెచ్చరించారు. 

ysrcp mla muruga nagarjuna sensational comments on tdp chief chandrababu naidu

చంద్రబాబు దళిత వ్యతిరేక భావజాలంతో ఉన్నారని ఎద్దేవా చేశారు వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున. ఆదివారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాబు దళితద్రోహి అని చాలా సార్లు చెప్పానని గుర్తుచేశారు.

దళితులలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ టీడీపీ అధినేత వ్యాఖ్యానించిన విషయాన్ని నాగార్జున ప్రస్తావించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్నిఅపహస్యం చేసిన ఏకైకనాయకుడు చంద్రబాబేనని, బాబు దళితులకు చేసిన అన్యాయాన్ని రాష్ట్ర ప్రజలు మరచిపోలేరని ఆయన ధ్వజమెత్తారు.

ప్రతిపక్షనేత బరితెగించారని.. ఐఏఎస్ అధికారి విజయ్‌ కుమార్‌ను విమర్శించడం ద్వారా తన కులదురహంకారాన్ని మరోసారి బయట పెట్టుకున్నారని మండిపడ్డారు. విజయ్ కుమార్ కు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని.. లేనిపక్షంలో ఎస్సి ఎస్టి చట్టం ప్రకారం ఆయనపై చర్యలు తీసుకోవాలని నాగార్జున డిమాండ్ చేశారు.

Also Read:బోస్టన్ తో విజయసాయి అల్లుడికి లింక్, అదో చెత్త: చంద్రబాబు

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం విషయంలో కూడా ఇదే వైఖరిని టీడీపీ చీఫ్ అనుసరించారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు దళితులు అభివృద్ది చెందడం ఇష్టం లేదని.. క్షమాపణలు చెప్పకపోతే పల్లెల్లోకి ప్రతిపక్షనేతను అడుగుపెట్టనీయమని మేరుగ నాగార్జున హెచ్చరించారు. 

మూడు రాజధానులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) అందించిన నివేదికపై తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. క్లయింట్ కు ఏది కావాలో అది బీసీజీ రాసిందని, అదో చెత్త నివేదిక అని ఆయన అన్నారు. 

బోస్టన్ కంపెనీతో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డికి సంబంధాలున్నాయని ఆయన అన్నారు. అజయ్ కల్లెం చెప్పినట్లుగా జీఎన్ రావు కమిటీ నివేదికను సమర్పించిందని ఆయన అన్నారు. బోస్టన్ కమిటీకి తలాతోక లేదని ఆయన అన్నారు. అమరావతిని రాజధానిగా వైఎస్ జగన్ అప్పుడు అంగీకరించారని ఆయన అన్నారు. 

Also Read:ఏపి రాజధాని వివాదం... జగన్ తల్లీ, చెల్లిని కూడా వదలని టిడిపి

ఎవరిని మోసం చేయడానికి హైపవర్ కమిటీ వేశారని ఆయన ప్రశ్నించారు. విశాఖపట్నంలో హుదుద్ తుఫాను వచ్చిన విషయాన్ని, కర్నూలు వరదలతో మునిగిపోయిన విషయాన్ని నివేదికలో ఎందుకు ప్రస్తావించలేదని ఆయన అడిగారు. రాజధానిని మరో ప్రాంతానికి తరలిస్తే పెట్టుబడులు అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు. బోస్టన్ కమిటీని అసలు ఎప్పుడు వేశారని ఆయన అడిగారు. 

అమరావతి ప్రాంతమే రాజధానికి అనుకూలమని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందని ఆయన చెప్పారు. రాజధానిని మరో ప్రాంతానికి తరలించే హక్కు జగన్ కు లేదని అన్నారు. బోస్టన్ కమిటీ నివేదిక అబద్ధాల పుట్ట అని, అదో చెత్త కాగితమని ఆయన అన్నారు. అమరావతి నిర్మాణానికి లక్షా 15 వేల కోట్లు అవుతుందని ఎవరు చెప్పారని ఆయన అడిగారు. 

విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి చెప్పింది బీసీజీ రాసిచ్చిందని చంద్రబాబు మండిపడ్డారు. ఆ నివేదికకు విశ్వసనీయత ఉందా అని అడిగారు. అజయ్ కల్లెం చెప్పిందే రాసిచ్చానని జీఎన్ రావు చెప్పారని, తప్పుడు నివేదికలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios