రష్యా అమ్మాయిని చేసుకున్నావు.. ఇద్దరు పిల్లల్ని కన్నావు.. వారి కులం ఎంటో చెప్పు: వైసిపి ఎమ్మెల్యే
జాతీయ,ప్రాంతీయ,అంతర్జాతీయ పెళ్లిళ్లు చేసుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందు తన పిల్లలది ఏ కులం,ఏ మతమో చెప్పాలని వైసిపి ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు నిలదీశారు.
తాడేపల్లి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు ఒంటినిండా తిక్క ఉందని... అందువల్లే ఎప్పుడూ పిచ్చోడిలా నోటికి వచ్చినట్లు వాగుతుంటాడని వైసిపి ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు విమర్శించారు. ఆయన విమర్శలను ఎలా తిప్పి కొట్టాలో తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసని... అయితే ఐదుకోట్ల మంది ప్రజల ముఖ్యమంత్రిగా ఆయన సంయమనం పాటిస్తున్నారని అన్నారు.
ముఖ్యమంత్రిగా జగన్ ను పవన్ పిలవను అంటున్నారని... ఆ పిచ్చోడు పిలిస్తే ఎంత పిలవకపోతే ఎంతని అన్నారు. చంద్రబాబు పెంపుడు ప్యాకేజి నేత పవన్ అని ఎమ్మెల్యే దుయ్యబట్టారు.
పవన్ ఓ వైపు నాకు కులం, మతం లేదని మాట్లాడుతూనే మరోవైపు హిందువులు, క్రిస్టియన్ల గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ఇలా కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఆయన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆయన ఉపన్యాసాలు, ప్రసంగాలు కూడా అదే విధంగా ఉంటున్నాయన్నారు.
read more పక్షపాతం లేకుండా ప్రమోషన్లు...సీఎం జగన్ ను కలిసిన ఏఎస్పీలు
వైఎస్ జగన్ కు కులం, మతం, ప్రాంతం లేదని... రాష్ట్ర ప్రజలందరూ ఆయన వాళ్లేనని అన్నారు. సీఎం ఇదివరకే చెప్పినట్లు ఆయన మతం మానవత్వమని...కులం మాట నిలబెట్టుకునే కులమని అన్నారు.
''జగన్ ప్రజాసంకల్ప యాత్ర చేశారు. ఎన్నోవేల కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టి 13 జిల్లాలు తిరిగారు. ఆ యాత్రలో అన్ని మతాలు, కులాలకు చెందినవారు కలసి వారి బాధలు చెప్పుకున్నారు. ఆ రోజు ఏ బాధలు అయితే విన్నారో వాటిని పరిష్కరించేదిశగా నవరత్నాలు అమలు చేస్తున్నారు.'' అని కోరుముట్ల అభిప్రాయపడ్డారు.
''ప్రతిపక్ష నేతలు పవన్, చంద్రబాబులు ప్రజలకు మంచి చేయడం ఇష్టం లేదేమో అన్నట్లు మాట్లాడుతున్నారు. ఎస్సీ, ఎస్టీలు మతాలు మారితే వారి కులాలు మారవు. అదేవిధంగా కమ్మ, రెడ్డి, కాపు ఎవరైనా సరే వారు మతం మారితే కులం మాత్రం మారదు. ఇది అర్దం చేసుకోవాలి. తెలియకపోతే తెలిసినవారిని అడగండి.'' అని చురకలు అంటించారు.
''పవన్ మాటలన్నీ చూస్తే కులాలు, మతాల మధ్య ఘర్షణలు సృష్టించేలా వున్నాయి. ఆయన మాటలు హద్దుమీరి మాట్లాడుతున్నట్లుగా ఉంది. సీఎం, ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమంలా ఉంది. ఇతర కులాలవారు మతం మారితే ఎలాంటి స్దితి ఉంటుందో రాజ్యాంగం చెప్పింది. 2 లక్షల పుస్తకాలు చదివిన మీకు ఈ విషయం తెలియదా'' అంటూ పవన్ ను ప్రశ్నించారు.
ఏపి పోలీసులకు గుడ్ న్యూస్... జగన్ ప్రభుత్వ కీలక నిర్ణయం
''మీరు మూడు వివాహాలు చేసుకున్నారు. క్రిస్టియన్ అయిన రష్యా అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లల్ని కన్నారు. జాతీయ,ప్రాంతీయ,అంతర్జాతీయ పెళ్లిళ్లు చేసుకున్నారు. అది మీ వ్యక్తిగతం. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ప్రజలు గమనిస్తుంటారు. ఈ సమాజానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అలా పెళ్లి చేసుకునేటప్పుడు కులాలు, మతాలు గుర్తుకురాలేదా?మరి ఆ పిల్లలది ఏ కులం,ఏ మతం'' అంటూ నిలదీశారు.
పవన్ కల్యాణ్ ఇష్టారీతిగా మాట్లాడితే ప్రజలే బుద్ది చెప్తారన్నారు. చంద్రబాబుకు దత్తపుత్రుడులా పవన్ వ్యవహరిస్తున్నారని అన్నారు. అయినా జగన్ ను విమర్శించే అర్హత పవన్ కల్యాణ్ కు లేదన్నారు. పవన్ ప్రవర్తన చూస్తుంటే ఆయన మానసికస్దితి బాగోలేదని అర్దం అవుతుందని కోరుముట్ల శ్రీనివాసులు అన్నారు.