Asianet News TeluguAsianet News Telugu

రాజధాని కోసం కాదు... అందుకోసమే అమరావతి రైతుల ఉద్యమం: వైసిపి ఎమ్మెల్యే సంచలనం

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమంపై వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  

ysrcp mla gudiwada amarnath shocking comments on amaravati farmers protest
Author
Amaravathi, First Published Jan 4, 2020, 2:25 PM IST

అమరావతి: బోస్టన్‌ కమిటి రాష్ట్ర సమగ్ర అభివృద్దికి సంబంధించి కొన్ని అంశాలను బేస్‌ చేసుకుని ముఖ్యమంత్రి జగన్‌ కు నివేదిక సమర్పించిందని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంఎల్ఏ గుడివాడ అమరనాథ్ తెలిపారు. ఆ నివేదికను వైసిపి పార్టీ స్వాగతించిందన్నారు. వారు రాష్ట్రంలోని 13 జిల్లాలను ఆరు ప్రాంతాలుగా  విభజించి కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలు,రాయలసీమ ప్రాంతానికి సంబంధించి సమగ్ర నివేదికను అందచేశారని పేర్కొన్నారు.

గతంలో రాష్ట్ర విభజన సమయంలో శ్రీకృష్ణ కమిటి రిపోర్ట్‌, శివరామకృష్ణ కమిటి నివేదిక, జిఎన్‌ రావు కమిటి నివేదికలో చెప్పిన అంశాలనే వారు కూడా ప్రస్తావించడం జరిగిందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో వేసిన శ్రీకృష్ణ కమిటి ఏదైతే ప్రధానంగా రాష్ట్రంలో ఉత్తరాంధ్రకు చెందిన మూడు జిల్లాలు,రాయలసీమకు చెందిన నాలుగు జిల్లాలు మొత్తంగా ఏడు జిల్లాలు వెనకబాటు తనానికి గురయ్యాయని పేర్కన్నట్లు గుర్తుచేశారు. 

ఈ రెండు ప్రాంతాలు ఏ రకంగా వెనకబడి ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. రాయలసీమకు తాగు,సాగునీరు ఎంత అవసరమో వారు చెప్పడమే కాదు ఉత్తరాంధ్రకు చెందిన తాగు, సాగునీటి అవసరాలు కూడా చెప్పారన్నారు. రాష్ట్రంలో ఉన్న నిరక్షరాస్యత, ఫిషరీష్‌ అభివృద్ది లాంటి ప్రాధాన్యత అంశాలను ప్రస్తావించారని గుర్తుచేశారు.

ప్రపంచంలోని గ్రీన్‌ ఫీల్డ్‌ సిటీల ప్రయోగాలు ఏ రకమైన ఇబ్బందులకు గురయ్యాయనేది ప్రస్తావించారన్నారు. రాష్ట్రంలో చేపట్టాల్సిన ప్రాజెక్ట్‌ లు, కెనాల్స్‌ విస్తరణ లాంటి అనేక విషయాలను వారు పరిగణనలోనికి తీసుకున్నారని తెలిపారు. ఇప్పటికే రెండున్నరలక్షల అప్పులు ప్రభుత్వంపై నెట్టేసి ఉన్న స్దితిలో తిరిగి కొత్త  రాజధానిపై లక్షకోట్లు పెట్టుబడులు పెట్టి ఇబ్బందులు పడే ప్రయోగం మంచిది కాదని అన్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు ఇలాంటి ప్రయోగాలు చేసి ఏ విధంగా నష్టపోయాయో గమనించాలన్నారు. 

ఏ రాజధాని అయినా ఏ నగరమైనా అది ప్రజల వల్ల అభివృధ్ది చెంది నగరంగా  మారాలి తప్ప ప్రభుత్వమే నగరంగా అభివృద్ది చేయడమనేది ఫెయిల్యూర్‌ కాన్సెప్ట్‌ అని అభిప్రాపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఆ విధంగా ఫెయిలైన 50 నగరాలను ప్రస్తావించారు.ఉదాహరణలు కూడా చెప్పారన్నారు. అలాంటి పరిస్దితులలో విశాఖ, కర్నూలు, అమరావతి మూడు రాజధానులుగా బాగుంటాయని ప్రతిపాదనలుగా వారు కూడా చేశారని పేర్కొన్నారు. 

ఈ రాష్ట్ర సమగ్ర అభివృధ్దికి 13 జిల్లాల ప్రజల ఆకాంక్షలకు ఆయా ప్రాంతాలలో ఉన్న వనరులను బట్టి ఆ ప్రాంతాల అభివృద్దికి ఇచ్చిన రిపోర్ట్‌ ను వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్వాగతిస్తోందని ఎమ్మెల్యే అన్నారు.  కొన్ని పత్రికలలో రాజధానిపై తీసుకున్న నిర్ణయాన్ని మూడు ముక్కలు అని ప్రస్తావిస్తూ రాష్ట్రాన్ని ముక్కలు చేసే ఆలోచనను ప్రజలకు కలిగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 

 ఒకే రాజధాని ఉంటే మరో రాజధాని కట్టుకుంటే తప్పేముందనే భావన ప్రజలకు కలుగుతుందని అభిప్రాయపడ్డారు. 13 జిల్లాలు సమానంగా అభివృద్ది చేయాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి జగన్‌ ఉంటే వారు ఎందుకు ఆ రకమైన విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

more news  మరోసారి పవన్ కల్యాణ్ కు ఝలక్: జగన్ కు జైకొట్టిన జనసేన ఎమ్మెల్యే రాపాక

 ఒక దగ్గర కట్టినంతమాత్రాన మరోచోట అభివృద్ది చేయకూడదనే ప్రస్తావన ఎందుకు చేస్తున్నారో అర్దం కావడంలేదన్నారు. ఒక దగ్గర పరిపాలన,మరోచోట అభివృద్ది జరిగినప్పుడు ఏ రకమైన ఫలితాలు వచ్చాయో మన రాష్ట్రం ఉదాహరణగా దేశానికి కనపడుతోందన్నారు.  

గతంలో వెనకబాటు నేపథ్యంలోనే తెలంగాణ ఉద్యమం ప్రారంభమయ్యిందని...అది 1960–70లలో మాత్రమే ఇలా జరిగిందన్నారు. ఆ తర్వాత 2001లో మరోసారి తెలంగాణ  ఉద్యమం ప్రారంభమయ్యిందని కానీ ఈసారి అది కేవలం హైద్రాబాద్‌ కోసం జరిగిందన్నారు.  అలాంటి పరిస్దితి తిరిగి రాకూడదంటే అన్ని ప్రాంతాలలో అబివృద్ది జరగాలని, ఆయా ప్రాంతాలలో వనరులను బట్టి సదుపాయలను బట్టి అభివృద్ది చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి ఉన్నట్లు పేర్కొన్నారు. 

విషప్రచారం చేసి  ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి ప్రాంతాలకు ప్రాంతాలకు మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు టిడిపి ఎందుకు చేస్తోందో అర్థం కావడంలేదన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు పలు ప్రాంతాలలో ఉద్యమాలు నడిచాయని...హైకోర్టు బెంచి కావాలని కృష్ణా,గుంటూరులలో కర్నూలలో ఉద్యమాలు జరిగాయని గుర్తుచేశారు. 

విశాఖప్రాంతంలో స్టీల్‌ ప్లాంట్‌ కోసం ''విశాఖ ఉక్కుఆంధ్రుల హక్కు'' అని నినదించి 26 వేల ఎకరాలు ఇచ్చి ప్రజలు చేసింది అసలైన త్యాగమన్నరు. స్టీల్‌ ప్లాంట్‌,ఎన్టీపిసి, నూతనంగా నిర్మిస్తున్న బార్క్‌ కోసం ఎన్‌ఓఏబి కోసం 30 వేల ఎకరాల ఇచ్చిన ప్రజలది త్యాగం అంటే  అని అన్నారు. కానీ అమరావతి ప్రాంతంలో చంద్రబాబును పక్కన కూర్చోబెట్టుకుని తమ భూములు రేట్లు తగ్గిపోతున్నాయని చేసిన ఉద్యమం ఎక్కడా లేదన్నారు.

read more  బోస్టన్ తో విజయసాయి అల్లుడికి లింక్, అదో చెత్త: చంద్రబాబు

''తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలనో అభివృద్ది చెందాలనో, ఉపాధి అవకాశాలు రావాలనో చేసిన త్యాగాలను త్యాగం అంటారు.రేట్లు పెరగాలని కోరుకుంటూ చేసేది ఉద్యమం అంటారా?ఏమంటారో తెలియని పరిస్దితి. గత ఐదు సంవత్సరాలలో మీ రాజధాని ఏంటి అని చెప్పలేని పరిస్దితి. అమరావతి అనేది పెద్ద స్కామ్‌ అని,ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని దేశవ్యాప్తంగా మాట్లాడుకున్న సందర్బాలు. 

భువనేశ్వరి వ్యాపారంలో భాగంగా అక్కడకు వచ్చినట్లు కనిపిస్తుంది.హెరిటేజ్‌ కోసం భూములు కొన్నారు. అందుకే ఉద్యమంలో భాగస్వాములయ్యారు.వెన్నుపోటు సమయంలో బయటకు రాలేదు. విభజన సమయంలో బయటకు రాలేదు. అన్యాయాలు జరిగేటప్పుడు ఆమె రాలేదు. ఇప్పుడు ఇదంతా చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

వైయస్‌ జగన్‌ ఆలోచనలకు అనుగుణంగా అన్ని ప్రాంతాలు అభివృద్ది సాదిస్తాయనే ప్రజలందరూ పండుగ వాతావరణంలో ఉన్నారు. ఆయన ప్రతిపాదనలకు కమిటీల రిపోర్ట్‌ లను సమర్దిస్తున్నారు. గత ఆరునెలలుగా ఇదేరకంగా పులివెందుల పంచాయితీ అనే విమర్శలు చేస్తూ టిడిపి వారు మాట్లాడటం చూశాం. 

పులివెందుల పంచాయితీ అంటే పేదలకు వైద్యం అందించాలని ఆరోగ్యశ్రీ పధకం తీసుకురావడం, ఫీజురీయంబర్స్‌ మెంట్‌ తీసుకురావడం,చదువుకోవాలనుకునే వారికోసం అమ్మ ఒడి ప్రవేశపెట్టడం, సాగునీరు తాగునీరు అందించేందుకు ప్రాజెక్టులు తీసుకురావడం, స్టీల్‌ ప్లాంట్‌ ను ప్రైవేటైజ్‌ కాకుండా చేయడం ఇలాంటివి పులివెందుల పంచాయితీనా సమాధానం చెప్పాలి. చంద్రబాబు ఉధ్దేశ్యంలో పులివెందుల పంచాయితీ అంటే ఏంటో తెలియడం లేదు'' అని అమర్‌నాథ్ మండిపడ్డారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios