అమరావతి: రాజధాని రాష్ట్ర పరిధిలోనే అంశమని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి స్పష్టం చేశారని... అయినప్పటికి చంద్రబాబు అండ్ కో రాజధానిపై ఇంకా తప్పుడు ప్రచారం చేస్తూనే వున్నారని  వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు సి రామచంద్రయ్య ఆరోపించారు. కేంద్ర మంత్రి పార్లమెంట్ లో ఏమన్నారో రాష్ట్ర ప్రజలు కూడా విన్నారని... టిడిపి నాయకులు చెప్పే అబద్దాలను ఎవరూ నమ్మే పరిస్థితులు లేవన్నారు. 

ఇప్పటికైనా రాజధాని రైతులు దీక్ష విరమించాలని రామచంద్రయ్య సూచించారు. ఇంకా చంద్రబాబు నాయుడు మాయమాటలను నమ్మి పోసపోవద్దని సూచించారు. రాజధాని రైతులను సీఎం జగన్ అన్ని విధాలుగా ఆదుకుంటానని ఇప్పటికే అనేకసార్లు హామీ ఇచ్చారని... ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకునే రకం కాబట్టి ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.

''రాజధాని రైతులకు సీఎం రెండు ఆఫ్షన్స్ ఇచ్చారు... ఒకటి ఇప్పటికే ప్రభుత్వానికి ఇచ్చిన భూములను అభివృద్ధి చేయడం, రెండోది కావాలనుకుంటూ వారి భూముల వారికి తిరిగి ఇవ్వడం. ఈ రెండింట్లో రైతులు దేన్నాయినా ఎంచుకోవచ్చు. ఇది పూర్తిగా రైతుల ఇష్టమే'' అని రామచంద్రయ్య పేర్కొన్నారు.

read more  ఆ హత్యతోనే దేవినేని ఉమ రాజకీయ రంగప్రవేశం...: మంత్రి అనిల్ ఘాటు విమర్శలు

మాజీ సీఎం చంద్రబాబు తన వారికోసం అమరావతిలో ఉద్యమం చేయిస్తున్నాడని ఆరోపించారు. కొందరు పెయిడ్ లీడర్స్ ను తయారుచేసి అమరావతి ప్రాంతంలో తిప్పుతున్నాడని అన్నారు. రాజధాని రైతులకు ఎలాంటి అన్యాయం జరగదన్నారు రామచంద్రయ్య. 

చంద్రబాబు పాలనలో ఒక్కసారైనా రెఫరెండం పెట్టారా.. అయినా లోకేష్ ఓడిపోయాక ఇంకా రెఫరెండం ఎందుకు అని ఎద్దేశా చేశారు. హైదరాబాద్ నుంచి ఎందుకు రాత్రికి రాత్రే అమరావతికి పరిగెత్తుకు వచ్చావు..? అని ప్రశ్నించారు.

చంద్రబాబు నాయుడే పెద్ద తుగ్లక్ ''రాజధాని విషయంలో శివరామకృష్ణన్  ఇచ్చిన నివేదికను అమలు చేయని తుగ్లక్ చంద్రబాబు. నాలుగు పంటలు పండే భూముల్లో రాజధాని పెట్టిన పెద్ద తుగ్లక్ చంద్రబాబు'' అంటూ జగన్ ను తుగ్లక్ అంటూ టిడిపి నాయకులు చేస్తున్న విమర్శలకు రామచంద్రయ్య తిప్పికొట్టారు. 

read more  వైసిపిపైనే కాదు వారిపైనా ప్రతీకారం తీర్చుకుంటా... లేదంటే రాజకీయ సన్యాసమే: చంద్రబాబు సవాల్

''మా విధానమే పరిపాలన వికేంద్రీకరణ... చంద్రబాబు చేసిన అవినీతికి తప్పకుండా జైల్ కు వెళ్లారు. బీజేపీలోకి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లను పంపిన జైల్ కు వెళ్లడం తప్పదు. చంద్రబాబు మీద తప్పకుండా విచారణ జరుగుతుంది. ఆయన అవినీతి అంతా కేంద్ర ప్రభుత్వానికి తెలుసు'' అని అన్నారు. 

''ఇప్పుడు చంద్రబాబు చచ్చిన పాము. టీడీపీ వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ. టీడీపికి సమాధి కట్టే రోజులు దగ్గరలొనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఎందుకు రాజధానిలో పర్యటన చేస్తానంటున్నారు. పార్లమెంట్ లో చెప్పిన తరువాత కూడా రాజకీయాలు చేస్తున్నారు.చంద్రబాబు  కోసమే పవన్ కళ్యాణ్ రాజధానిలో పర్యటన చేస్తున్నారు'' అని రామచంద్రయ్య ఆరోపించారు.