అమరావతి:  రాజధాని కోసం అమరావతి ప్రజలు చేపడుతున్న నిరసనలు 50 రోజులకు చేరాయి. ఈ క్రమంలో టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబు  నాయుడు మరోసారి ఈ నిరసనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమరావతి ఉద్యమాన్ని, అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 

''రాజధాని కోసం పోరాటం యాబై రోజులకు చేరుకుంది, మీ పోరాటానికి ధన్యవాదాలు. ఇప్పటి వరకు పోలీసులు అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారు. అయినప్పటికీ తమ ప్రాంత ప్రయోజనాలు, రాష్ట్రం మేలు కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తూనే  వున్నారు. మీ పట్టుదల, తెగువ  గురించి ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది'' అంటూ  రాజధాని ప్రాంత ప్రజలను చంద్రబాబు కొనియాడారు. 

''33,500 ఎకరాలు త్యాగం చేసిన త్యాగ ఘనులు మీరు. బుద్ధి హీనుడైన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇలాంటి దుర్మార్గపు పనులు చేస్తున్నాడు. తప్పకుండా భవిష్యత్తులో అందరికి మంచి రోజుకు వస్తాయి. ఇష్టానుసారంగా ప్రవర్తించే అధికారులు, నాయకులు, పోలీసులపై తప్పకుండా ప్రతికారం తీర్చుకుంటా. ఇది రాజకీయ పోరాటం కాదు ప్రజల పోరాటం'' అని చంద్రబాబు హెచ్చరించారు.  

''వైసిపి నాయకులు, ప్రభుత్వం అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరింగిందని అంటారు... అధికారంలో వున్నది వారే అయినా దీన్ని నిరూపించరు. ఇన్ సైడ్ ట్రేడింగ్ విచారణకు మేము సహకరిస్తామని ఇప్పటికే స్పష్టంగా చెప్పాం. అయినప్పటికీ ఈ విషయంపై కదలిక లేదంటే అసలు ఇన్ సైడ్ ట్రేడింగ్ జరగలేదని ప్రజలకూ అర్ధమవుతోంది'' అని చంద్రబాబు పేర్కొన్నారు. 

read more  రాజధాని మహిళలను గోళ్లతో రక్కి, గిచ్చి...పోలీసుల కర్కశత్వం...: వర్ల రామయ్య

''ప్రభుత్వ పాలన ఓ పిచ్చి కుక్క మాదిరిగా ఉంది. సీఎం జగన్ అబద్దాలు చెప్తున్నారు. తప్పుడు సాక్షాలు చూపిస్తున్నారు. అమరావతిపై దుష్ప్రచారం చేస్తూ రాజధానిని తరలించే  ప్రయత్నం జగన్  చేస్తున్నారు'' అని చంద్రబాబు ఆరోపించారు. 

''దేశ రాష్ట్రపతి ఏపి హైకోర్టు అమరావతిలో వుండాలని జీవో జారీ చేశారు. అలాగే టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్ సాక్షిగా పోరాడి అమరావతి ఇండియా మ్యాప్ లో పెట్టించారు. అలాంటిది రాజధానిని తమకు నచ్చిన చోటికి తీసుకువెళతామంటే ఎలా కుదురుతుంది'' అని అన్నారు.

'' ప్రభుత్వానికి ఒక పాలసీ, నమ్మకం అనేవి ఉండాలి. అన్ని కంపెనీలు అమరావతికి తీసుకువద్దామని చూసా. అందుకోసం రైతులు 34వేల ఎకరాలు విరాళంగా ఇచ్చారు'' అని చంద్రబాబు గుర్తుచేశారు. 

''ఈ దుర్మాగపు ముఖ్యమంత్రికి సంపాదించడం చేతకాదు. సీఎంకి పాలన కూడా చెయ్యడం రాదు. ఖబడ్దార్ సీఎం అని నేను హెచ్చరిస్తున్నాను. పనికి రాని పార్టీ, చెత్త పార్టీ వైస్సార్ పార్టీ'' అని మండిపడ్డారు. 

read more  పిచ్చి నవ్వు నవ్వుతూ ఎదురుదాడి.: జగన్ మీద చంద్రబాబు వ్యాఖ్య

'' మీ ఏడుపు, బాధ సమస్యలకు పరిష్కారం కాదు. ఒక్కొక్కరి కళ్ళలో పౌరుషం రావాలి. మీరు ఏకాకులు కాదు ఐదు కోట్ల మంది మీ  వైపు వున్నారు.  అమరావతి ఇక్కడే ఉండాలని అన్ని పార్టీలు అంటున్నాయి. ఇక్కడ అన్ని కులాల వారు ఉన్నారు. మన బలం ఐకమత్యం'' అంటూ నిరసనకారులకు ధైర్యాన్నిచ్చారు.

''నేను అడుగుతున్నా... నీకు ధైర్యం ఉంటే రాష్ట్రంలో ఎక్కడైనా డిబేట్ పెట్టండి తేల్చుకుందాం. ఆర్కేవాళ్ళ చుట్టాలని తీసుకువెళ్లి రైతులని చెప్తారా...?  ఎవరు పెయిడ్ ఆర్టిస్టులో తెలుస్తూ ఉంది. మూడు రాజధానులు అంటే అందరూ మనల్ని చూసి నవ్వుతున్నారు. ప్రపంచంలో ఎక్కడ మూడు రాజధానులు లేవు'' అంటూ చంద్రబాబు వైసిపిపై మండిపడ్డారు.

''అమరావతిలో ప్రతి ఒక్కరికి కృషి ఉండాలని పిలుపునిచ్చా. 57 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు. ప్రభుత్వానికి అనుమానం ఉంటే సీఆర్డీఏ అకౌంట్లో చూసుకోవచ్చుడబ్బు ఉందొ లేదో. ఉన్మాది, దుర్మార్గుడిలా సీఎం వ్యవహరిస్తున్నాడు. మళ్ళీ ఎన్నికలకి వెళ్ళండి, మీరు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తిసుకుంటా'' అని చంద్రబాబు సవాల్ విసిరారు.

''ఒక రాజధాని ఒక ముఖ్యమంత్రి - మూడు రాజధానులు ముఖ్యమంత్రి అని రెఫరెండం పెట్టండి. మీరు గెలిస్తే నేను మాట్లాడకుండా ఉండిపోతా. రాష్ట్రంలో అభివృద్ధి, ఆగిపోయింది. ఈనాడు దేశంలో అభివృద్ధిలో రాష్ట్రం వెనక ఉంది'' అని అన్నారు. 

''పెన్షలు తీసేసి పెదవాళ్ళ పొట్ట కొట్టిన దుర్మార్గపు ప్రభుత్వం ఇది. రాక్షస, రావణాసుర పాలన ఇది. విశాఖపట్నం ఒక సుందర నగరంలా తయారు చెయ్యాలని అనుకున్నాను. ఆరునెలల్లో గొల్లపల్లి ప్రాజెక్ట్ పూర్తి చేసి కియా పరిశ్రమకి నీళ్లు అందించా. ప్రభుత్వాన్ని ఒక పద్ధతి ఆలోచన లేదు. వాస్తవాలు గుర్తు పెట్టుకొని పౌరుషంగా  పోరాడదాం'' చంద్రబాబు సూచించారు.