కృత్రిమ ఉద్యమమే.. అంతా ఆయన మనుషులే,: బాబుపై ఆమంచి వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. రాజధాని పేరుతో రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేసిన చంద్రబాబు జోలె పట్టుకుని మరో డ్రామాకు రెడి అయ్యారంటూ ఆయన వ్యాఖ్యానించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. రాజధాని పేరుతో రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేసిన చంద్రబాబు జోలె పట్టుకుని మరో డ్రామాకు రెడి అయ్యారంటూ ఆయన వ్యాఖ్యానించారు.
భోగి మంటల్లో సీఎం వైఎస్ జగన్ ఫోటోలు, జీఎన్ రావు, బోస్టన్ కమిటీ రిపోర్డులు తగులబెట్టడం దుర్మార్గపు చర్యగా ఆయన అభివర్ణించారు. రాజధాని ప్రకటనకు ముందు చంద్రబాబు నాయుడు తన బినామీలతో అమరావతి ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు.
Also Read:ఆయనొక్కడికే పరిపాలన వికేంద్రీకరణ కావాలి: జగన్‌పై యడ్లపాటి ఫైర్
అధికార వికేంద్రీకరణ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలందరూ స్వాగతిస్తున్నారని.. ఒక్క చంద్రబాబుకు సంబంధించిన మనుషులే ధర్నా చేస్తున్నారని ఆమంచి ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు హైదరాబాద్‌లో ఉండే అవకాశం ఉన్నప్పటికీ కేసుల భయంతో అమరావతికి వచ్చేశారని కృష్ణమోహన్ చురకలంటించారు.
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న వైఎస్ జగన్ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి హృదయాలు గెలుచుకున్నారని ఆమంచి తెలిపారు. చంద్రబాబును టీడీపీని గత ఎన్నికల్లో ప్రజలు బంగాళాఖాతంలో కలిపేశారని.. దోపిడి, దుర్మార్గాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారని ఆయన గుర్తుచేశారు.
Also Read:అమరావతి పతనమే కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్: జగన్‌పై జయదేవ్ వ్యాఖ్యలు
ప్రజలు 151 సీట్లతో జగన్‌ను గెలిపించారని, తమ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ప్రజల తీర్పును అగౌరవపరిచినట్లేనని కృష్ణమోహన్ వ్యాఖ్యానించారు. సీఎం రమేశ్, సుజనా చౌదరి బీజేపీ కండువాతో టీడీపీ ఎజెండా ఎత్తుకున్నారని, బీజేపీలోకి పంపించిన బీనామీలతో బాబు రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని ఆమంచి సవాల్ విసిరారు.
ఆర్ధిక మూలాలు పోతున్నాయని బాధపడుతున్న చంద్రబాబు.. కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించారని కృష్ణమోహన్ ఆరోపించారు. భవిష్యత్‌లో ఎంతమంది పోలీసులను వెంటబెట్టుకున్నా.. తిరగలేని పరిస్ధితిని చంద్రబాబు కొనితెచ్చుకుంటున్నారని ఆయన చురకలంటించారు. అమరావతిని ముంపు ప్రాంతంగా శివరామకృష్ణన్ కమిటీ తేల్చి చెప్పిందని.. చెన్నై ఐఐటీ నిపుణులు కూడా ఇదే విషయాన్ని చెప్పారని కృష్ణమోహన్ గుర్తుచేశారు.