ఆయనొక్కడికే పరిపాలన వికేంద్రీకరణ కావాలి: జగన్‌పై యడ్లపాటి ఫైర్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సెటైర్లు వేశారు మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడు మాత్రమే పరిపాలన వికేంద్రీకరణ కోరుకుంటున్నారని.. ఎక్కడా ప్రభుత్వం మారితే రాజధానులు మార్చలేదని ఆయన గుర్తుచేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సెటైర్లు వేశారు మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడు మాత్రమే పరిపాలన వికేంద్రీకరణ కోరుకుంటున్నారని.. ఎక్కడా ప్రభుత్వం మారితే రాజధానులు మార్చలేదని ఆయన గుర్తుచేశారు.
పరిశ్రమల ద్వారానే అభివృద్ధి సాధ్యం తప్ప రాజధానులు వల్ల అభివృద్ధి సాధ్యం కాదని యడ్లపాటి సూచించారు. 17 లోపల రైతులు హై పవర్ కమిటీ కి విన్నవించుకోవాలని చెప్తున్నారని, ప్రభుత్వం మాత్రం రాజధాని ని ఏమి చెస్తారో మాత్రం చెప్పటం లేదని ఆయన మండిపడ్డారు.
Also Read:పవన్ పర్యటనను అడ్డుకోం, అరెస్ట్ కూడా చేయం... పోలీసుల క్లారిటీ
జగన్ నిర్ణయం వల్ల ఉద్యోగస్తులు, ప్రజలు అంతా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని యడ్లపాటి ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో కమ్మ సామాజిక వర్గం ఎక్కువ అంటున్నారు కానీ అది తప్పని, ఇక్కడ అన్ని కులాలు ఉన్నాయన్నారు.
విశాఖ అంటే చంద్రబాబుకి ప్రేమ ఎక్కువని .. హుదుద్ సమయంలో అక్కడే ఉండి పనులు పూర్తి చేయడమే అందుకు నిదర్శనమని యడ్లపాటి గుర్తుచేశారు. జగన్ మాత్రం విశాఖ తుఫాన్ వచ్చినప్పుడు కనీసం ప్రక్కనే ఉండి తొంగి కూడా చూడలేదని, అలాంటప్పుడు జగన్ కి విశాఖ మీద ఎలా ప్రేమ పుట్టిందో ఆయనకే తెలియాలని చురకలంటించారు.
హైకోర్టు బెంచ్ ఇస్తే ఎవరికి అభ్యతరం లేదని, రాజధాని ప్రాంతంలో ఏమి జరుగుతుందని హైకోర్టు సుమోటోగా తీసుకొని ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేసిందని వెంకట్రావు అన్నారు. రైతులు మీదా, మహిళ మీదా ఇంతటి దారుణమైన దాడులు ఎప్పుడు చూడలేదని యడ్లపాటి ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read:జగన్ వెన్నుపోటు పొడిచాడు:అమరావతి రైతుల దీక్షలో వంగవీటి రాధా
జగన్మోహన్ రెడ్డి కి కుదిరితే అభివృద్ధి వికేంద్రీకరణ చెయ్యాలి తప్ప కులాల,మతాలు,మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ధోరణి మార్చుకోవాలని ఆయన హితవు పలికారు. ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు హైదరాబాద్ ని అభివృద్ధి చేశారని యడ్లపాటి గుర్తుచేశారు.
అమరావతి, పోలవరం కూడా అభివృద్ధి చెయ్యాలని చంద్రబాబు భావించారని వెంకట్రావు తెలిపారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం రాజధాని వద్దు.. పోలవరం వద్దు అనే ధోరణిలో ఉన్నారు తప్పించి అభివృద్ధి చేయాలనే ఆలోచన మాత్రం కనిపించడం లేదని వెంకట్రావు మండిపడ్డారు.