తెలంగాణ కోసమే ఆంధ్రాలో విద్యుత్ కోతలు...: కళా వెంకట్రావు

ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యుత్ కోతలను నివారించడంలో ఫెయిల్ అయ్యిందని ఏపి టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు ఆరోపించారు. 

YSRCP Govt Failed to pre-assess power crisis: kala venkatrao

గుంటూరు:  విద్యుత్‌ ఛార్జీలు పెంచమని ఎన్నికల ముందు హామీనిచ్చి అధికారంలోకి రాగానే ఛార్జీలు పెంచి ముఖ్యమంత్రి జగన్‌ ప్రజలపై పెనుభారం మోపారని  టీడీపీ రాష్ట్ర అధ్యకక్షుడు కళా వెంకట్రావు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు 2014 అధికారంలోకి వచ్చీ రాగానే 22.5 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ లోటును అధిగమించి 24 గంటల నిరంతరాయ విద్యుత్‌కి శ్రీకారం చుట్టి మిగులు విద్యుత్‌ను చేతిలో పెడితే జగన్‌ ప్రభుత్వం మాత్రం విద్యుత్‌ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. 

అధికారంలోకి వచ్చిన  తర్వాత వైసిపి ప్రభుత్వం ఈ 9 నెలల కాలంలో అదనంగా ఒక్క యూనిట్ కూడా విద్యుత్‌ను ఉత్పత్తి చేయకుండా ఛార్జీలు పెంచి ప్రజలపై భారం వేస్తున్నారని అన్నారు.   500 యూనిట్ల పైబడి వాడిని వారికి యూనిట్ కు 90 పైసల చొప్పున పెంచారన్నారు. గతంలో యూనిట్ ధర రూ. 9.05 పై ఉండగా.. ఇప్పుడు రూ.9.95 పైసలకు పెరిగిందని అన్నారు. ఈ పెంపుతో 1.35 లక్షల మంది వినియోగదారులపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు.

read  more  నీయమ్మా మొగుడికి ఇవ్వాలా ఫించను...ఆ మంత్రి సమాధానం ఇలాగే: వర్ల రామయ్య

''సోలార్‌ విద్యుత్‌ రంగంలో మహానది కోల్‌ మైన్స్‌ లో టన్ను బొగ్గు రూ.1600 కోట్లకు అగ్రిమెంట్ వున్నది. కానీ తెలంగాణలోని సింగరేణి నుండి టన్ను రూ. 3,710 లు పెట్టి జగన్‌ బొగ్గు కొంటున్నారు. గత ఐదేళ్ళలో ఏనాడు ఒక్క విద్యుత్‌ సంస్థ కూడా తమకు ప్రభుత్వం బకాయిలు చెల్లించడంలేదని కోర్టుకు వెళ్ళిన దాఖలాలు లేవు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు మూతపడేలా చేసి వాళ్ళను కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు'' అని కళా వెంకట్రావు మండిపడ్డారు.  

ఇప్పటికే చిన్నతరహా పరిశ్రమల పరిస్థితి అస్తవ్యస్థంగా తయారయ్యిందని.. ఈ విద్యుత్‌ ఛార్జీల పెంపుతో కార్మికులు రోడ్డునపడే ప్రమాదం ఉందన్నారు. విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

జైట్యాక్స్‌ కోసం పీపీఏలు రద్దు చేయాలని చూశారని... కానీ కేంద్రం అందుకు అడ్డు చెప్పిందన్నారు. రాష్ట్రంలో 9,500 మిలియన్‌ యూనిట్ల మిగులు విద్యుత్‌ ఉన్నందువల్లే ప్రైవేట్ విద్యుత్‌ సంస్థల నుండి విద్యుత్‌ కొనుగోలుకు అనుమతి నిరాకరించామని చెప్పడం దుర్మార్గమన్నారు. మిగులు విద్యుత్‌ ఉండటమంటే వైసీపీ ప్రభుత్వం వచ్చాక పరిశ్రమలు మూతపడటమా..? అని ఎద్దేవా చేశారు. 

read more  అందుకోసమే అధికారులపై వేటు... వైసిపి ప్రణాళిక ఇదే...: అచ్చెన్నాయుడు

విజయవాడ ఆటోనగర్‌లో పనులు లేక 5 లక్షల మంది అయోమయంతో బ్రతుకున్నారని తెలిపారు. తక్కువ ధరకు పీపీఏల ద్వారా విద్యుత్‌ వస్తుంటే కొనుగోలు చేయకుండా అధిక ధరలకు కొనుగోలు చేస్తూ విద్యుత్‌ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. 9,500 మిలియన్‌ యూనిట్ల మిగులు విద్యుత్‌ ఉంటే.. గ్రామాల్లో అప్రకటిత విద్యుత్‌ కోతలు ఎందుకు విధిస్తున్నారు..? అని ప్రశ్నించారు. 

''రూ.4.84 పైసలకు వస్తున్న పవన విద్యుత్‌ ధర ఎక్కువని చెబుతున్న జగన్‌ ప్రభుత్వం నేడు రూ.11.68 పెట్టి కొంటున్నది. ఇది మూర్ఖత్వమా? అనుభవరాహిత్యమా? కమీషన్ల దాహమా? 2019-20లో కూడా విద్యుత్‌ చార్జీలు పెంచనని చంద్రబాబు ప్రకటించారు. సోలార్‌ విద్యుత్‌ రంగంలో రూ.36,604 కోట్ల పెట్టుబడులు ఆకర్షించారు. కానీ అధికారంకు వచ్చిన  9 నెలల్లోనే జగన్‌ రాష్ట్రాన్ని కరెంట్ కోతల రాష్ట్రంగా మార్చారు'' అని మండిపడ్డారు.

''విద్యుత్‌ సంస్కరణలు అమలు చేసి యావత్‌ దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ సంస్థలను చంద్రబాబునాయడు తీర్చిదిద్దితే మీరేం చేశారు? జపాన్‌, ఫ్రాన్స్‌ వంటి దేశాలు కూడా సీఎం వైఖరిని తప్పుపట్టేలా వ్యవహరించారు. 2014లో విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యం 9,529 మెగావాట్ల మాత్రమే ఉండగా 2018 నాటికి 19,680 మెగా వాట్లకు పెంచి మిగులు విద్యుత్‌ ఉత్పత్తి సాధించాం'' అని కళా వెంకట్రావు అన్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios