జగన్ ను వారు ఖైమా చేయడం ఖాయం... పివిపి ట్వీట్ వెనుక...: వర్ల రామయ్య
ముఖ్యమంత్రి జగన్ అరబ్ కంపనీ రస్ అల్ ఖైమా పేరు వింటేనే వణికిపోతున్నాడని టిడిపి సీనియర్ నాయకులు వర్ల రామయ్య ఆరోపించారు. నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్ తర్వాత ఆయనలో వణుకు మరింత ఎక్కువయ్యిందన్నారు.
గుంటూరు: తనపై మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులు ఆరోపణలు చేస్తే దానిపై స్పదించాల్సిన అవసరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉందన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. కానీ ఆయనకు ఎవరు సలహా ఇస్తున్నారో తెలియదు గానీ చెత్త సలహాలు ఇస్తున్నారు..అలాంటి సలహా ఇచ్చేవారు నిజమైన చెత్త సలహాదారుడని అన్నారు.
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రిగా... పార్టీ అధ్యక్షుడిగా.. ప్రభుత్వం నేతగా.. స్పందించాల్సిన అవసరం జగన్ పై ఉందన్నారు. బాధ్యతల నుంచి పారిపోవడానికి ఆయనకు వీలులేదని...ఇలాగే మౌనం వహిస్తాను అంటే అర్ధ అంగీకరం అనుకోవాలా? లేక పూర్ణాంగీకరం అనుకోవాలా? అని ప్రశ్నించారు.
''రస్ అల్ ఖైమా ఏదో రోజు జగన్ ను ఖైమా చేయబోతుందని అర్ధమవుతుంది. జగన్ తనపై వచ్చిన ఆరోపణలపై సమాధానంలో చెప్పకపోతే బరీలో నుంచి పారిపోయిన కోడిపుంజుతో సమానమనం. ఐదేళ్ల తెలుగుదేశం పాలనపై ఇప్పుడు సిట్ విచారణ వేశారని..9 నెలల నుంచి ఏం చేశారని అడిగారు. సిట్ అధికారి రఘురామ్ రెడ్డిపైనే మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆయన పని చేసి అన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ అంటే అక్కసు చూపిస్తారని సమాచారం వచ్చిందన్నారు. సిట్ విచారణ నుంచి అయన స్వచ్ఛందంగా తొలగాలని కోరుతున్నాం'' అని వర్ల పేర్కొన్నారు.
ప్రభుత్వం ఏర్పడి 9నెలలు అవుతుంటే ఇంత వరకు మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వం విధానాలను చెప్పలేదంటే ఏమనుకోవాలని అన్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీడియా సమావేశం పెట్టమని ప్రాతికేయ మిత్రులు అడిగేవారు..కానీ ఎందుకో జగన్ ని అడగలేకపోతున్నారని అన్నారు.
''యూఏఈకి చెందిన రస్ అల్ ఖైమా కంపనీ వారు సెర్బియా దేశంలో నిమ్మగడ్డ ప్రసాద్ ను అరెస్టు చేయించి విచారించారు. ఆయన రూ.854కోట్లు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టానని చెప్పాడు. రస్ అల్ ఖైమా వారు ఆ విషయాన్ని న్యాయస్థానాల దృష్టికి తీసుకువచ్చి జగన్ కంపనీలలో పెట్టిన పెట్టుబడులను ఇప్పించమని భారత ప్రభుత్నాన్ని కోరారు. వీటిపై మీరేందకు మాట్లాడరండి. మీ కంపెనీలో ఉంది దొంగ డబ్బే కదా...?'' అని నిలదీశారు.
read more ''సాయిరెడ్డి... వసూళ్లు పూర్తైనాదా? లోడ్ ఎత్తాలి...జగన్ డైలాగ్''
''ప్రధాని దగ్గరకు ఎందుకు వెళ్లారని అడిగితే ఏం సమాధానం చెప్పారు. రస్ అల్ ఖైమా అంటే ఎందుకు జగన్ వణుకుతున్నారు. మీకు ధైర్యం ఉంటే మీడియా సమావేశం పెట్టి మీపై వస్తున్న అరోపణలను ఖండించే దమ్ము ఉందా? కేంద్రం మంత్రి జై శంకర్ ను కలవడానికి ఎందుకు భయపడుతున్నారు'' అని అడిగారు.
''అరబ్ దేశాలల్లో చీటింగ్ కేసుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. భారత్, యునైటెడ్ అరబ్ రెండు దేశాల మధ్య ఒప్పందం వుంది. సెక్షన్ 44ఏ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసిజర్ ప్రకారం మా దేశ కోర్టుల తీర్పు మీరు అంగీకరించాలి.. మీదేశం కోర్టుల తీర్పులను మేము అంగీకరిస్తామని ఒప్పదం చేసుకోవడం జరిగింది. కేంద్రం ప్రభుత్వం జనవరి 17, 2020న గేజిట్ పబ్లికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. ఆ గేజిట్ పత్రికను చూపి జగన్ లో చలి మొదలైంది. భారత ప్రధాని మిమ్మలి ఏ విధంగా రక్షిస్తారో సమాధానం చెప్పాలి'' అని అన్నారు.
''నిమ్మగడ్డ ప్రసాద్ మీ కంపెనీలో రూ.854 కోట్లు పెట్టుబడి పెట్టిన మాట వస్తావం కాదా? అని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా. రస్ అల్ ఖైమా మన ముఖ్యమంత్రి వాళ్ల దేశానికి తసుకెళతారా లేదా ఇక్కడ ఉంచుతారా అని రాష్ట్ర ప్రజలు అత్రుతతో చూస్తున్నారని అన్నారు. నిమ్మగడ్డ ప్రసాద్ 7 నెలల నుంచి సెర్బియాలో ఉంటే మీరు ఏమి చేశారు సార్. మీ తరపున ఎంత మంది అడ్వోకేట్స్ సెర్బియా, అరబ్ దేశాలకు వెళ్లారో సమాధానం చెప్పాలి'' అని రామయ్య డిమాండ్ చేశారు.
read more చంద్రబాబు ఇలాకా కుప్పంలో వైసీపీ నేత హత్యకు కుట్ర
'' ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మహిళ ముఖ్యమంత్రిని చూడాలని వైసీపీలో కీలకనేత పొట్లూరి వరప్రసాద్ ట్వీట్ చేశారు. ఆయన ఎక్కువగా విదేశాల్లో ఉంటారు. ఆయనకు సెర్బియాలో నిమ్మగడ్డ అరెస్టు అయిన విషయం తెలిసి ఉండవచ్చు. అందుకే ఈ ట్వీట్ పెట్టి వుంటాడు. అయితే పెట్టిన గంట తరువాత ఆ ట్వీట్ తీసివేయడం జరిగిందన్నారు. ఆ ట్వీట్ ను ఎందుకు తీసివేశారో సమాధానం చెప్పాలి'' అని వర్ల డిమాండ్ చేశారు.
''జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా నిజాలు చెప్పాలి. మనీ ల్యాండరింగ్ కు సంబంధించిన వివరాలను సీబీఐ ఆరు దేశాలను కోరడం జరిగింది. ఆ సమచారం బయటకు వస్తుందని మేము అందరం ఎదురు చూస్దున్నాం. రైల్వే స్టేషన్ లో దృష్టి మళ్లించే దొంగలు ఉంటారు..అలాగే వైసీపీ నాయకులు కూడా ప్రజల దృష్టి మళ్లించడం కోసం మా పార్టీ నాయకుడు అచ్చెన్నాయుడిపై తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు''అని వర్ల ఆరోపించారు.