Asianet News TeluguAsianet News Telugu

''సాయిరెడ్డి... వసూళ్లు పూర్తైనాదా? లోడ్ ఎత్తాలి...జగన్ డైలాగ్''

టిడిపి నాయకులు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరోసారి సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డిలపై సోషల్ మీడియా వేదికన సంచలన వ్యాఖ్యలు చేశారు. 

budda venkanna satires on cm jagan and mp vijayasai reddy
Author
Vijayawada, First Published Feb 22, 2020, 6:45 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

గుంటూరు: టిడిపి అధికారప్రతినిధి ఎమ్మెల్సీ బుద్దావెంకన్న మరోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిలపై విరుచుకుపడ్డారు. ఇటీవల వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో బాగా పాఫులర్ అయ్యిన ''రమణా... చెక్ పోస్టు పడతాది...లోడెత్తాలిరా..'' డైలాగ్ ను ఉపయోగించి వీరిద్దరిపై  సెటైర్లు విసిరారు వెంకన్న. 

"సాయిరెడ్డి.. ''జే ట్యాక్స్'' వసూలు పూర్తైనాదా? లోడ్ ఎత్తాలి" అని వైఎస్ జగన్ గారు అనడం. మద్యపాన నిషేధం పేరుతో చెత్త కంపెనీల దగ్గర జే టాక్స్ వసూలు చేసి మద్యానికి అలవాటు పడిన వారి ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు.''

''పీపీఏలను ముట్టుకొని కొట్టిన షాక్ కి మొహం కందగడ్డలా మారింది. ఇన్సైడర్ ట్రేడింగ్ అని అరిచినా అవుట్ పుట్ ఏమి లేక పోయేసరికి డిలా పడ్డారు. 43 వేల కోట్లు కొట్టేసిన 9 ఇయర్స్ ఇండస్ట్రీకి ఏం చెయ్యాలో పాలుపోక సిట్ వేసుకొని కూర్చున్నారు'' అంటూ బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు.  

read more  చంద్రబాబు ఇలాకా కుప్పంలో వైసీపీ నేత హత్యకు కుట్ర

ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన విజయసాయి రెడ్డి ముఖ్యమంత్రి జగన్ పైనే కుట్రలు పన్నుతున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగానే జగన్ తప్పుడు  నిర్ణయాలు తీసుకునేలా చేస్తూ అతడిని ప్రజలే ఛీ కొట్టెలా చేస్తున్నాడని అన్నారు. దీంతో అతడు సీఎం పదవిని కోల్పోగానే ఆ సీట్లో కూర్చోవాలని విజయసాయి రెడ్డి ప్రయత్నిస్తున్నారని వెంకన్న వ్యాఖ్యానించారు. 

''పీపీఏ లను ముట్టుకొని తుగ్లక్ కి షాక్ కొట్టింది. పీపీఏల దెబ్బకి ప్రధాని దగ్గర నుండి అంతర్జాతీయ మీడియా దొబ్బులు పెట్టే పరిస్థితి తెచ్చుకున్నాడు.''

''పిపిఏల్లో అక్రమాలు జరిగినట్టు ఫినాయిల్ దొంగ సొమ్ముతో నడిచే సొంత వెబ్ సైట్స్ లో వార్తలు రాయించి, వాటినే నిజాలుగా నమ్మించి ప్రపంచ వ్యాప్తంగా తుగ్లక్ ని ఛీ కొట్టేలా చేసి ముఖ్యమంత్రి పదవి కొట్టేయాలి అని ఫినాయిల్ ప్లాన్ చేశాడు.'' అంటూ వెంకన్న ట్వీట్ చేశారు. 

''ఫెడరల్ ఫ్రంట్ లో ఊపేస్తా అన్నాడు. ఉన్న 43 వేల కోట్లలో కొంత ఖర్చు చేసి బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టాడు. ఉప ప్రధాని పదవి నాకే కావాలి అంటూ 2000 వేల కోట్లు ఫెడరల్ ఫ్రంట్ మిత్రులకు సమర్పించుకున్నాడు.''

''ఫెడరల్ ఫ్రంట్ ఫిడేల్ ఫ్రంట్ అయ్యేసరికి ఇప్పుడు బిజెపితో కాళ్ళ బేరానికి వెళ్ళాడు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఢిల్లీలోనే ఉంటా.. బిజెపిలో కలిసిపోవాల్సిందే అంటున్నాడు తుగ్లక్'' అని  సీఎం జగన్ ను వెంకన్న ఎద్దేవా చేశారు. 

read more  అచ్చెన్నాయుడు, గణేష్ లను టార్గెట్ చేసింది అందుకే..: వైసిపిపై చంద్రబాబు ఆగ్రహం

''చంద్రబాబు గారికి అవినీతి మరక అంటించబోయి బీజేపీతో వైకాపా కలిసిపోతుంది అని ట్విట్టర్ ద్వారా ప్రకటించి విజయసాయి రెడ్డి గారు నాలుక కర్చుకున్నారు'' అంటూ మరో ట్వీట్ చేశారు. 

''మహా మేత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, బంజారా హిల్స్ లో  ఉన్న స్థలాన్ని రెగ్యూలరైజ్ చెయ్యాలని చంద్రబాబు గారి దగ్గర ప్రాధేయపడ్డాడు. తుగ్లక్ రెడ్డి ఏమో 5 ఏళ్ల లోనే  43 వేల కోట్లకు పడగెత్తాడు. ఆ మ్యాజిక్ వెనుక ఉన్న లాజిక్ సీబీఐ, ఈడీ పూసగుచ్చినట్టు వివరిస్తున్నారు.''

''తీగ లాగితే డొంక కదిలింది. జైలు పిలుస్తుంది "కావాలి తుగ్లక్.. రావాలి తుగ్లక్" అని సిద్ధంగా ఉండండి విజయసాయి రెడ్డి  గారు'' అని సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డిలను బుద్దా వెంకన్న హెచ్చరించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios