అమరావతి:ఏపీ రాష్ట్రంలో ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పేరును కూడ విజిలెన్స్ నివేదికలో ఉండడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.  ఏపీ ఈఎస్ఐలో భారీ స్కాం చోటు చేసుకొందని విజిలెన్స్ నివేదిక విడుదల చేసింది. 

Also read:మోడీ ఆదేశాల మేరకే, విచారణ చేసుకోవచ్చు: ఈఎస్ఐ కుంభకోణంపై అచ్చెన్నాయుడు

టెలీ హెల్త్ సర్వీసెస్ కంపెనీకి నామినేషన్ పద్దతిలో  కాంట్రాక్టులను అప్పగించాలని  టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు  ఈఎస్ఐ డైరెక్టర్ రవికుమార్ కు లేఖ రాశాడు. నామినేషన్ పద్దతిలోనే మందులు, పరికరాల కాంట్రాక్టును  టెలీ హెల్త్ సర్వీసెస్ కంపెనీకి ఇవ్వాలని మంత్రి అచ్చెన్నాయుడు లేఖ రాసినట్టుగా  విజిలెన్స్ కమిటీ నివేదికలో పేర్కొంది.

Also read:తెలంగాణలో మాదిరే: ఏపీ ఈఎస్ఐలో భారీ స్కాం

 ఏపీ రాష్ట్రంలో ఈఎస్ఐలో  సుమారు రూ. 925 కోట్ల మేరకుమందుల కొనుగోలు జరిగాయి. అయితే ఇందులో సుమారు రూ. 100 కోట్ల మేరకు చెల్లింపులు తప్పుడు బిల్లుల ఆధారంగా చేసినవేనని ఈ నివేదిక తేల్చింది.  

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత  ఏపీలో రాష్ట్రంలో  టీడీపీ హయంలో చేపట్టిన కార్యక్రమాలపై విచారణ చేపట్టింది. గత ప్రభుత్వ హయంలో తీసుకొన్న నిర్ణయాల్లో చోటు చేసుకొన్న అవకతవకలను బయటకు వెలికితీసే పనిలో ఉంది.

వైసీపీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలపై  టీడీపీ తరపున మాజీ మంత్రి అచ్చెన్నాయుడు  ఒంటికాలిపై విరుచుకుపడుతున్నారు. ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పేరు ఉండడం ఏపీ రాజకీయాల్లో  సర్వత్రా చర్చకు దారి తీసింది. ఈ విషయమై టీడీపీతో పాటు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఎలా స్పందిస్తారో చూడాలి.