గుంటూరు జిల్లా నులకపేటలో చిన్నారులకు పెనుప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. గ్రామంలో రమణ బాబు, మున్నా అనే నాలుగు సంవత్సరాల చిన్నారులు శుక్రవారం స్థానిక ఉర్దూ పాఠశాల వద్ద ఆడుకుంటున్నారు.

ఈ క్రమంలో స్కూల్‌ ఆవరణలోని ప్రహరీ గోడ సందులోకి వెళ్లి చిన్నారులు ఇరుక్కుపోయారు. బయటకు రాలేక, ఊపిరి ఆడక చిన్నారులు భయాందోళనలకు గురయ్యారు. వీరి ఏడుపు, కేకలను విన్న పాఠశాల సిబ్బంది ఏమైందోనని ఉరుకులు పరుగులు పెట్టారు.

వెంటనే స్పందించి చిన్నారులిద్దరిని బయటకు తీయడంతో బాలల తల్లిదండ్రులు, స్థానికులు ఊపీరి పీల్చుకున్నారు. అయితే గోడ మధ్యలో ఇరుక్కుపోయి బయటకు రావడానికి ప్రయత్నించడంతో చిన్నారులిద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. 

Also Read:

పోలవరం ముంపు... రూపాయి ఎక్కువైనా సరే సాయం: అధికారులకు జగన్ ఆదేశాలు

సెక్షన్ 151 ఎలా ప్రయోగిస్తారు: చంద్రబాబు అరెస్ట్‌పై హైకోర్టు

విశాఖలో బాబు వెనక్కి: హైకోర్టులో టీడీపీ లంచ్ మోషన్ పిటిషన్