Asianet News TeluguAsianet News Telugu

జగన్ సర్కార్ కీలక నిర్ణయం: ఆ రెండు రాజధాని గ్రామాలు ఇక...

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని వెలువరించిది. రెండు రాజధాని గ్రామాలను తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

Two capital  villages merged in thadepalli municipality
Author
Thadepalli, First Published Feb 6, 2020, 7:05 PM IST

అమరావతి: తాడేపల్లి మున్సిపాలిటీలో 8 గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాజధాని గ్రామాలైన పెనుమాక, ఉండవల్లిని కూడా ప్రభుత్వం తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం చేసింది. అంతేకాకుండా పాతూరు, వడ్డేశ్వరం, ఇప్పటం, మల్లెంపూడి, చిర్రావూరు, గుండిమెడ గ్రామాలను కూడా మున్సిపాలిటీలో విలీనం చేస్తూ అధికారిక నిర్ణయం తీసుకుంది. 

ఇటీవలే రాజధాని అమరావతిపై జగన్ సంచలన కామెంట్స్  చేశారు. ప్రస్తుతం రాజధానిగా చెబుతున్న ప్రాంతంలో సరైన రోడ్లు కూడా లేవని ఆయన అన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం 5 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఈ రాజధాని కోసం ఖర్చు చేసిందని అన్నారు. అమరావతి నిర్మాణానికి 1.09 లక్షల కోట్లు అవసరమవుతాయని... మౌలిక సదుపాయాల కల్పనకు ఒక్కో ఎకరానికి 2  కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు.  ఇటువంటి స్థితిలో అమరావతిని నిర్మించడం చాలా కష్టమని ఆయన అన్నారు. 

read more  రాజధాని కోసం భూములిచ్చిన వారిలో 14వేల మంది రైతులే కారు...మరి ఎవరంటే..: సజ్జల

అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ గా కొనసాగుతుందని, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఉంటుందని ఆయన చెప్పారు. విశాఖపట్నం ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరమని ఆయన అన్నారు. అన్ని ప్రాంతాలకూ న్యాయం చేస్తామని, భవిష్యత్తు తరాలకు జవాబుదారీగా ఉండాలని ఆయన అన్నారు.

ఐదేళ్లలో విశాఖను అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రచించామని ఆయన చెప్పారు .లక్ష కోట్లు ఖర్చు పెట్టలేకనే పాలన వికేంద్రీకరణను చేపట్టామని ఆయన చెప్పారు. తాను బాహుబలి గ్రాఫిక్స్ చూపించబోనని, లేనివి చూపించి ప్రజలను మోసం చేయలేనని ఆయన చెప్పారు సింగపూర్, జపాన్ తరహా గ్రాఫిక్స్ చూపించలేనని ఆయన అన్నారు. తాను ఎవరినీ తప్పు పట్టాలని అనుకోవడం లేదని ఆయన అన్నారు. ఖర్చు చేయడానికి జపాన్, సింగపూర్ లను సృష్టించడానికి మన వద్ద లేవని, తాను ఎంత చేయగలుగుతానో అంతే చెప్తానని ఆయన అన్నారు.

read more   ప్రభుత్వానికి నష్టం వచ్చినా సరే... అలాగే చేయండి...: అధికారులకు జగన్ ఆదేశం

విశాఖపట్నంలో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయని, అమరావతిలోనూ అభివృద్ధి కొనసాగుతుందని జగన్ చెప్పారు. అమరావతిపై పెట్టే ఖర్చులో పదిశాతం ఖర్చు చేస్తే విశాఖ హైదరాబాదు, బెంగుళూర్, ముంబైలతో పోటీ పడుతుందని ఆయన అన్నారు. 

ఈ వ్యాఖ్యలను బట్టే రాజధానిని ఎట్టిపరిస్థితుల్లో తరలించాలన్న నిర్ణయంతో జగన్ వున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజధాని గ్రామాలపై తాజా నిర్ణయం వెలువరించినట్లు తెలుస్తోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios