Asianet News TeluguAsianet News Telugu

అమరావతి పోలీసులను పరుగు పెట్టించిన తెలంగాణ వాసులు

ఏపి రాజధాని అమరావతి ప్రాాంతంలో కొన్ని తెలంగాణ కుటుంబాలు రెండురోజులుగా అనుమానాస్పద రీతిలో సంచరిస్తుండటం కలకలం రేపింది. దీంతో వారికోసం భారీ పోలీసు బలగం రంగంలోకి దిగింది. 

telangana people hulchul in amaravathi
Author
Amaravathi, First Published Feb 29, 2020, 9:18 PM IST

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతమైన తాడేపల్లిలో కొన్ని తెలంగాణ ప్రాంతానికి చెందిన కుటుంబాలు కలకలం సృష్టించాయి. ఇప్పటికే రాజధాని ఉద్యమంతో అట్టడుకుతున్న  ప్రాంతంలో ఇలా అనుమానాస్పద వ్యక్తులు గుడారాలు వేసుకుని కనిపించడంతో గందరగోళం నెలకొంది. అక్కడికి భారీ బలగాలతో చేరుకున్న పోలీసులు అసలు విషయం తెలుసుకుని వారిని అక్కడినుండి వెళ్లగొట్టారు. 

తాడేపల్లిలోని నిర్మానుష్య ప్రాంతానికి 11 కార్లలో వచ్చిన పది కుటుంబాలు ఖాళీ ప్రదేశంలో టెంట్లు వేసుకుని ఉన్నారు. రెండు రోజులుగా వారు అక్కడే వుండటం, కార్లను కూడా అక్కడే నిలుపుకోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.   

read more  సీఎం జగన్ తో ముఖేష్ అంబానీ సమావేశం... వీటిపైనే చర్చలు

అసాంఘిక శక్తులు ఉన్నాయేమోనన్న అనుమానంతో సుమారు 50 మంది పోలీసులతో సిఐ మల్లిఖార్జునరావు అక్కడికి చేరుకున్నారు. అక్కడున్న కార్లను తనిఖీ చేయగా వాటిలో పెద్ద ఎత్తున ఎల్.ఈ.డి. బల్బులు, జ్యోతిష్య సామగ్రి, పుస్తకాలు, ఆయుర్వేద మందులు లభించాయి. 

 పోలీసులు అక్కడున్నవారిని ప్రశ్నించగా తాము సంచార బుడగ జంగాలమని...జోతిష్యం చెప్పుకొని జీవిస్తామని తెలిపారు. అలాగే వారిలో కొందరు హోల్ సేల్ కు బల్బులు, ఆయుర్వేద మందులు కూడా అమ్ముకుని జీవిస్తామని తెలిపారు.

read more  జగన్ కు ''చంద్రబాబు ఫోబియా''... అందుకు విజయమ్మే కారణం...: బుద్దా వెంకన్న

. మొక్కు ఉన్నందున విజయవాడ కనకదుర్గమ్మని దర్శించుకునెందుకు ఈ ప్రాంతానికి వచ్చామని తెలిపారు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.  అక్కడున్న అందరివద్ద వివరాలు సేకరించిన పోలీసులు...ఈ ప్రాంతం హైసెక్యూరిటీ జోన్ లో వుందని చెప్పి ఉంటానికి వీల్లేదని వెంటనే ఖాళీ చేసి వెళ్లాలని హెచ్చరించారు. దీంతో వారద్దరు తమ టెంట్లను తొలగించి అక్కడి నుండి వెళ్లిపోయారు. 

Follow Us:
Download App:
  • android
  • ios