జగన్ కు ''చంద్రబాబు ఫోబియా''... అందుకు విజయమ్మే కారణం...: బుద్దా వెంకన్న
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డుకోడానికి వైసిపి నాయకులు పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దించారని టిడిపి ఎమ్మెల్సీ, అధికార ప్రతినిధి బుద్దా వెంకన్న ఆరోపించారు.
విజయవాడ: ముఖ్యమంత్రి జగన్, ఎంపీ విజయసాయి రెడ్డిలకు ''చంద్రబాబు ఫోబియా'' పట్టుకుందని టిడిపి అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. అందువల్లే తమ అధికారాన్నంతా ఉపయోగించిన ఆయనను ఎక్కడికక్కడ ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అందుకోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దించారని అన్నారు.
''అమ్మని ఓడించిన ఉత్తరాంధ్రని నాశనం చెయ్యాలని కంకణం కట్టుకున్నాడు వైఎస్ జగన్ గారు. హుద్ హుద్, తిత్లీ వచ్చినప్పుడు వెళ్లకుండా ఇగో తీర్చుకున్నాడు. ఇప్పుడు జిఎన్ రావు కమిటీలో ఉత్తరాంధ్ర ప్రమాదకర ప్రాంతం అని రాయించి పెట్టుబడులు రాకుండా చావుదెబ్బ తీశాడు'' అంటూ సోషల్ మీడియా వేదికన బుద్దా వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు.
''మూడు ముక్కలాట తుస్సుమనడంతో ఇతర జిల్లాల నుండి వైకాపా పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి చంద్రబాబు గారి యాత్రకి అడ్డుపడ్డాడు. పబ్జీ ఆడుతున్నా చంద్రబాబు గారే కనిపిస్తున్నారు'' అని ఎద్దేవా చేశారు.
read more చంద్రబాబును అడ్డుకోవాలని కాదు అడ్డు తొలగించుకోవాలని... విశాఖలో కుట్ర...: సబ్బం హరి
''శాస్త్రవేత్తలకు కూడా అంతుపట్టని ఫోబియా వెంటాడుతుంది. ''చంద్రబాబు ఫోబియా'' తో వణికిపోతున్నారు. 151 సీట్లు అని కాలర్ ఎగరేసి 9 నెలలు కాకముందే చంద్రబాబు గారు సింగంలా ఏ1, ఏ2 లను బొక్కలో వేసినట్టు కలలు ఇబ్బంది పెడుతున్నాయి పాపం. అందుకే ఉదయం లేస్తే చంద్రబాబు నామజపం, అడ్డుకోవడం'' అని పేర్కొన్నారు.
''ఎంపీ విజయసాయి రెడ్డి గారూ, చంద్రబాబు తాగే హిమాలయ వాటర్ బాటిల్ 60. రోజుకు 2 చొప్పున నెలకు 60 బాటిళ్లు. ఈ ఐదేళ్లలో 3600 బాటిళ్లకు 2లక్షల 16 వేలు. నీ లెక్క ప్రకారమే అయ్యిందనుకుందాం''
''సీఎం అయ్యాక 9 నెలల్లో లిక్కర్‌లో నొక్కేసిన కమీషన్‌లో 2వేల కోట్లు, 43వేల కోట్లు కొట్టేసిన కేసులో ఒక రోజు కోర్టుకెళ్లేందుకు అయ్యే ఖర్చు 60 లక్షలు, లండన్‌లో ఉన్న కూతురిని చూసి వచ్చేందుకు పెట్టిన ఖర్చు 90 లక్షలు. నీ నడుంకి కట్టుకునే బెల్టు 50 వేలు.''
''ఈ రేంజ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రజాధనాన్ని సాంతం నాకేస్తూ బాబుగారి హిమాలయ వాటర్‌పై పడి ఏడుస్తారేంటి!'' అంటూ ముఖ్యమంత్రి జగన్, వైసిపి నాయకులను ట్విట్టర్ ద్వారా నిలదీశారు బుద్దా వెంకన్న.
read more మరోసారి పేదల పక్షపాతి అని నిరూపించుకున్న జగన్