Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు వాహనంపై దాడి... పార్లమెంట్ లో ఆందోళనకు టిడిపి నిర్ణయం

తమ అధినేత చంద్రబాబు వాహనంపై అమరావతి పర్యటన సందర్భంగా జరిగిన రాళ్లు, చెప్పుల దాడిని టిడిపి నాయకులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ క్రమంలో పార్లమెంట్ స్థాయిలో ఈ ఘటనపపై నిరసన తెలియయజేయాలని టిడిపి ఎంపీలు భావిస్తున్నారు.   

TDP MPs plans to protest in Parliament over attck on chandrababu
Author
Guntur, First Published Nov 30, 2019, 4:00 PM IST

అమరావతి: మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడికి రాజధాని అమరావతి పర్యటన సందర్భంగా ఛేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ఆయన ప్రయాణిస్తున్న బస్సుపై కొందరు నిరసనకారులు చెప్పులు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇలా తమ నాయకుడిపై జరిగిన దాడిని ఖండిస్తూ డిల్లీ స్థాయిలో పోరాటం చేయాలని టిడిపి ఎంపీలు భావిస్తున్నట్లు సమాచారం. 

ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో సభలోనే చంద్రబాబుపై జరిగిన దాడి అంశాన్ని ప్రస్తావించాలని టిడిపి ఎంపీలకు ఇప్పటికే పార్టీ అధినాయకత్వం సూచించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ దాడిపై రాష్ట్ర డిజిపి చేసిన నిర్లక్ష్యపు వ్యాఖ్యలపై కేంద్ర హోమ్ సెక్రటరీకి ఫిర్యాదు చేయనున్నట్లు టీడీపీ ప్రకటించింది. 

రాజధాని అమరావతిలో పర్యటన, బస్సుపై దాడి, డీజీపీ వ్యాఖ్యలు తదితర అంశాలపై చర్చించేందుకు పార్టీ సీనియర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే డిసెంబర్ వ తేదీన రాజధాని నిర్మాణంపై విజయవాడలో రౌండ్‍టేబుల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. 

read more  40ఏళ్ల రాజకీయ అనుభవం...చంద్రబాబుపై మేం దాడి చేయిస్తామా...: పోలీస్ అధికారుల సంఘం

రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, నిపుణులు, ఉద్యోగ, ప్రజాసంఘాలను భాగస్వామ్యం చేయనున్నట్లు తెలిపారు. రాజధానిపై గత ప్రభుత్వ నిర్ణయాలు, నేటి ప్రభుత్వ ఆలోచనలపై ఈ సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు.

ఇక ఇప్పటికే తమ అధినేత చంద్రబాబుపై జరిగిన దాడిపై టిడిపి నాయకులు తుళ్లూరు పీఎస్‍లో ఫిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సుపై చెప్పులు, రాళ్లు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబు కాన్వాయ్ వద్ద నిరసనలకు అనుమతి ఎలా ఇచ్చారంటూ స్థానిక  పోలీసులను టిడిపి నాయకులు ప్రశ్నించారు.

read more  జగన్ పాలనపై చెప్పుకోడానికేం లేదు...చెప్పు తీసుకుని కొట్టుకోడం తప్ప: అనురాధ

ఐదు కోట్ల ఆంధ్రుల కలల రాజధానిని రాష్ట్ర ప్రజలకే కాదు యావత్ దేశానికి‌ చూపించాలనే తమ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటనను చేపట్టినట్లు టిడిపి శాసనసభాపక్ష ఉపనేత అచ్చెంనాయుడు తెలిపారు. ఇలా రాష్ట్ర సంక్షేమంకోసం పర్యటిస్తున్న సమయంలో ఆయన వాహనంపై కొంతమంది వైసిపి కార్యకర్తలు చెప్పులు, రాళ్లతో దాడి‌ చేయడం సిగ్గుచేటని... ఈ ఘటనను టిడిపి శాసనసభా పక్షం తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. 

జడ్ ప్లస్ భద్రత లో ఉన్న చంద్రబాబు పై జరిగిన దాడికి సిఎం జగన్, డిజిపి సవాంగ్ లు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.  గురువారం నాటి డిజిపి ప్రకటన‌ను చూసిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పక్షాలు ముక్కున వేలేసుకుంటున్నారని అన్నారు. 

తమ పర్యటనకు పోలీసుల అనుమతి వుందని కాబట్టి  పూర్తిస్థాయి భద్రత కల్పించాల్సిన బాధ్యత వారిపైనే వుంటుందన్నారు. కానీ పోలీసులే తమ బస్సుపై లాఠీ   విసిరినట్లు అచ్చంనాయుడు ఆరోపించారు. అలా  తమ వాహనంపై లాఠీలు వేసింది ఎవరో డిజిపి చెప్పాలని డిమాండ్ చేశారు. 

బాధ్యతాయుతమైన పదవుల్లో వున్న మంత్రులు ప్రతిపక్ష నేతపై గౌరవం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. తమపై రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు దాడులు చేశారని చెబుతున్నారని అన్నారు. 

ఒకవేళ రాజధాని ప్రాంత ప్రజలకు ఆగ్రహం ఉంటే తాము పర్యటించిన అన్ని‌చోట్లా దాడులు జరగాలి కానీ ఒక్క సెంటర్ ను‌ ఎంచుకుని అక్కడే దాడి‌ చేయడం ఏంటని  ప్రశ్నించారు. ఆ ఒక్కచోట తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లోప్రజలు తమకు సాదరస్వాగతం పలికారన్నారు.

భావ స్వేచ్చ అందరికీ ఉంటుందని డిజిపి అంటున్నారని... ఆయన అన్నట్లుగానే నిరసనకు అవకాశం ఇవ్వడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. ఇకపై కూడా  అందరికీ ఇదే విధంగా నిరసన తెలిపే అవకాశం ఇవ్వాలని... సీఎం జగన్ పర్యటనలో కూడా తాము నిరసనలు తెలుపుతామన్నారు. అప్పుడు డిజిపి తమ నిరసనకు అనుమతి ఇవ్వకపోతే ఆయన్ని వైసిపి కార్యకర్తగా పరిగణిస్తామన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios