గుంటూరు: గతంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గ్రామాలలో దాదాపు రూ.2,500కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగినట్లు టిడిపి ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ తెలిపారు. అందుకుగానూ ఈ ప్రభుత్వం ఎన్నో అవార్డులను అందుకుందని... కానీ ఆ నిధులను చెల్లించడానికి మాత్రం వెనుకాడుతోందని అన్నారు. కేంద్రం నుండి విడుదలైన ఉపాధిహామీ నిధులను సర్పంచులు, ఎంపిటిసిలుకు ఇవ్వకుండా స్వంత పథకాలకు దారిమల్లించడం దారుణని ఆయన జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

గుంటూరు జిల్లా కలెక్టరు కార్యాలయం ఎదుట జరిగిన జిల్లాస్థాయి ధర్నాలో ముఖ్య  రాజేంద్రప్రసాద్  పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.... ఉపాధిహామీ నిధుల విడుదల జాప్యంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. గ్రామ స్వరాజ్యం, గ్రామ సచివాలయాలు అంటూ ప్రజలను మభ్యపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం  మహాత్మాగాంధీ పేరుపై ఉన్న
ఉపాధిహామీ పథకం నిధులు విడుదల చేయకపోవడం కుట్రపూరితమేనని ఆరోపించారు.

read more  వైసిపి నేతలు గుడ్డలూడదీయడంలో మంచి అనుభవజ్ఞులు...: కాలవ షాకింగ్ కామెంట్స్

ప్రస్తుత ప్రభుత్వం బేషరతుగా నరేగా నిధులు విడుదల చేయాలనీ, లేనిపక్షంలో  ఉపాధిహామీ చట్టాన్ని ఉల్లంఘించినందుకు రాష్ట్ర ప్రభుత్వం ముద్దాయిగా కోర్టుకెక్క వలసిందేనని రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు. అంతవరకు వెళ్లేదాకా చూడొద్దని హెచ్చరించారు.

ఈ నిరసన కార్యక్రమంలో కార్యక్రమంలో తెలంగాణా పంచాయతీరాజ్ ఛాంబర్ గౌరవ అధ్యక్షుడు పుసులూరి నరేంద్ర(ఖమ్మం), తెలంగాణా ఛాంబర్ అధ్యక్షుడు చింపుల  సత్యనారాయణ రెడ్డి (రంగారెడ్డి), ఉపాధ్యక్షుడు అశోక్ రావు (కరీంనగర్), తెలంగాణ ఎంపిటిసిల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి కుమార్ గౌడ్ (మెదక్), నరేగా డైరెక్టర్ వీరంకి గురుమూర్తి,  రాష్ట్ర ఎంపిటిసిల సంఘం అధ్యక్షుడు కాసరనేని మురళీ, రాష్ట్ర జడ్పీటిసి ల సంఘం అధ్యక్షుడు అనేపు రామకృష్ణ నాయుడులు పాల్గొన్నారు. 

read more  ఇక రంగంలోకి ఏసిబి...వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు....: జగన్ హెచ్చరిక

అలాగే గుంటూరు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షురాలు గోగినేని వసుధ, ఎంపిటిసి సంఘం కార్యదర్శి నగరాజ కుమారి, ఉపాధిహామీ మండలి డైరెక్టర్ సుభాషిణి, ఎడ్లపాడు ఎంపిపి  స్టీఫెన్ కరుణాకర్, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటా నాయక్ తదితరులతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన సర్పంచులు, ఎంపిటిసిలు, ఎంపిపిలు, జడ్పీటిసిలు పాల్గొన్నారు.