తెలుగు అకాడమీతో ఇక పనేముంది...లక్ష్మీపార్వతి ఏమంటారు..: అశోక్ బాబు

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపట్టాలన్న ఏపి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై యార్లగడ్డ,  లక్ష్మీపార్వతిలు స్పందించాలని సూచించారు. 

TDP MLC ashok babu comments on english medium introducing ingovernment schools

విజయవాడ: ప్రాథమిక విద్య మాతృ భాషలోనే ఉండాలని కేంద్రం నిర్ణయిస్తే దానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎవరినీ సంప్రదించకుండానే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని అమలు నిర్ణయించారని... దీని వల్ల ఎలాంటి పర్యవసానాలు ఎదురవుతాయో ఆలోచించలేదన్నారు. ఈ నిర్ణయాన్ని పార్టీ తరపునే కాదు వ్యక్తిగతంగానే వ్యతిరేకిస్తున్నా అశోక్ బాబు తెలిపారు. 

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీషులోనే విద్యాబోధన ఉండాలన్న‌ ఏపి ప్రభుత్వం నిర్ణయం సరి కాదన్నారు. దీనిపై యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చేస్తున్న వ్యాఖ్యలు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయన్నారు. 

ఒకవైపు పేద వర్గాలు తిండి లేక అల్లాడుతుంటే వారు భాష గురించి ఎలా మాట్లాడతారని అనుకున్నారని ప్రశ్నించారు. యార్లగడ్డ ఇంత దిగజారి మాట్లాడతారని ఎవరూ  అనుకోలేదన్నారు. తెలుగు పండితులు, భాషాభిమానులు ప్రభుత్వం తీరును తప్పుబడుతున్నా యార్లగడ్డ ఒక్కరే ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని అశోక్ బాబు విమర్శించారు.

read more  జగన్ ప్రభుత్వ నిర్ణయం... తెలుగు జాతికే పొంచివున్న ప్రమాదం...: టిడిపి ఎమ్మెల్సీ

తెలుగు మీడియా సంస్థలు కూడా ఈ అంశానికి ప్రాధాన్యత ఇచ్చి మాతృబాషను పరిరక్షించాలన్నారు. తెలుగు అకాడమీ ఛైర్మన్ గా నియమితులైన లక్ష్మీ పార్వతి కూడా ప్రభుత్వ నిర్ణయంపై స్పందించాలన్నారు. 

రాష్ట్రమంతా ఇంగ్లీషు మీడియం అయితే ఇక తెలుగు అకాడమీతో పనేముంటుందన్నారు. గతంలో నారాయణ ఇంగ్లీషు మీడియం అంటే రోడ్డెక్కిన వారంతా ఇప్పుడు ఏమైపోయారని ప్రశ్నించారు. అసలు నిరుపేదలు, ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ఇంగ్లీషులో పాఠాలు అర్ధం‌ చేసుకోగలరా అన్న అనుమానం కలుగుతోందన్నారు.

ప్రభుత్వ నిర్ణయంపై సామాజిక ఉద్యమం రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ  జిఓను రద్దు చేసేంత వరకు రాజకీయాలకు అతీతంగా అందరూ పోరాడాలని సూచించారు. తెలుగు భాష కోసం తాము అందరినీ కలుపుకుని ఉద్యమిస్తామన్నారు.

ఏపి సీఎం జగన్ ఓ పిచ్చోడు...అందుకు నిదర్శనాలివే...: బుద్దా వెంకన్న

ఇక ఇసుక కొరతపై ఈనెల 14న చంద్రబాబు చేపట్టనున్న దీక్షకు అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ దీక్ష ద్వారా రాష్ట్రంలోని ఇసుక సమస్య కేంద్రం దృష్టికి కూడా  వెళ్లనుందని అశోక్ బాబు పేర్కొన్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios