గుంటూరు: దేశంలో ఐటి దాడులు జరిగితే తెలుగుదేశంపై వైసీపీ నేతలు ఆరోపణలు చేయటం విడ్డూరంగా ఉందని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మ్లాడుతూ... పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన వైసీపీ నేతలు టీడీపీపై అవినీతి ఆరోపణలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు. 

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ సీఎస్‌ వద్ద ఐటీ దాడుల్లో రూ.2 వేల కోట్లు దొరికాయని వైసీపీ నేతలు చెప్తున్నారు.  జగన్‌, ఆయన బృందానికి ఇంగ్లీష్‌ రాకపోతే ఐటీ శాఖ ప్రకటనను ఇంగ్లీష్‌ వచ్చిన వారి వద్దకు తీసుకెళ్లి సరిగా చదివించుకోవాలన్నారు. శ్రీనివాస్‌ ఇంట్లో దొరికిన మొత్తంపై ఐటీశాఖ ఎక్కడైనా ప్రకటించిందా? అని ప్రశ్నించారు.

విజయవాడ, విశాఖపట్నం, కడప, పూణే లతో పాటు దాదాపు 40 చోట్ల సోదాలు నిర్వహించామని ఐటీ డిపార్ట్‌ మెంట్ పేర్కొంది. ఆంధ్రా, తెలంగాణలోని 3 ఇన్‌ప్రాస్ట్రక్చర్‌ కంపెనీలపై సోదాలు జరిపగా దొరికిన మొత్తం రూ. 2 వేల కోట్లుగా పేర్కొందని తెలిపారు. వీటిలో దొరికిన డబ్బు రూ. 80 లక్షలు, బంగారం 71 లక్షలు, 25 బ్యాంకు లాకర్లు సీజ్‌ చేశామని చెప్పారని వివరించారు.

అయితే వైసీపీ నేతలు మాత్రం ఆ రూ. 2 వేల కోట్లు చంద్రబాబు మాజీ సీఎస్‌ వద్ద దొరికినట్లు తప్పడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఐటీ శాఖ ఈ మొత్తం టీడీపీ నేతల వద్ద దొరికాయని గానీ, చంద్రబాబు మాజీ సీఎస్‌ వద్ద దొరికినట్లు గానీ ఎక్కడైనా చెప్పిందా అని ప్రశ్నించారు. 

read more  బాబుపై ఐటీ ఆరోపణలు ప్రేరేపితం...ఆ సీబిఐ కేసులు మాత్రం వాస్తవం...: టిడిపి మాజీ ఎమ్మెల్యే

షాపూర్జీ పల్లాంజీ, మెగా ఇంజనీరింగ్‌, ప్రతిమ ఇన్‌ప్రాస్ట్రక్చర్‌ కంపెనీల్లో ఈ సోదాలు జరిగాయని తెలిపారు. ఈ కంపెనీల్లో దొరికిన రూ. 2 వేల కోట్లపై సీబీఐ విచారణ అడిగే దమ్ము వైసీపీకి ఉందా? కనీసం షాపూర్జీ పల్లాంజీ, మేగా ఇంజనీరింగ్‌ కంపెనీలను ప్రశ్నించే దమ్ము ఉందా? అని నిలదీశారు. 

మేగా ఇంజీనీరింగ్‌ గురించి గతంలో సాక్షిలో ఏం రాశారో తెలుసని... అదే కంపనీకి మళ్లీ పోలవరం నిర్మాణ భాద్యతలు ఇచ్చారని తెలిపారు. ప్రతిమ కంపెనీ కేసీఆర్‌ బినామీదని అందరికీ తెలుసని...వీటి గురించి సాక్షి పత్రికలో ఎందుకు రాయటం లేదని ప్రశ్నించారు. ఐటీ శాఖ ప్రకటనలోని ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీల పేర్లను వైసిపి నేతలు చెప్పాలన్నారు. 

శ్రీనివాస్‌ ఇంట్లో ఐటీ దాడులు పంచనామాలు తాము బయటపెడతామన్నారు. ఆ 3 ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీల పంచనామాలను వైసీపీ నేతలు బయటపెట్టాలని, లేకపోతే వారి  పంచలు ఊడగొడతామని హెచ్చరించారు.  

read more  ఎట్టా... ఆర్థిక నేరస్తుడే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతాడా..? : మాజీ మంత్రి సెటైర్లు

శ్రీనివాస్‌ దగ్గర దొరికిన డబ్బులకు చంద్రబాబుకు సంబందం ఉందని వైసీపీ అంటోందని... అయితే  వైయస్‌ దగ్గర కెమెరామెన్‌గా పనిచేసిన వంశీ అనే వ్యక్తి గతంలో తన భార్యను హత్య చేసి బెయిలుపై వచ్చి ఇప్పుడు మళ్లీ ఉద్యోగం చేస్తున్నాడు...అంటే ఆ హత్య వైయస్‌, లేదా జగన్‌ చేయించారా? అని ప్రశ్నించారు. 38 కేసులు, 13 చార్జ్‌సీట్లు, 43 వేల కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్‌, ఆ పార్టీ నాయకులకు టీడీపీని విమర్శించే  నైతిక హక్కు లేదని అశోక్‌బాబు అన్నారు.