గొంతు నొక్కడం కాదు జగన్ ఏకంగా మర్డర్ చేశారు...: నిమ్మల రామానాయుడు
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ రాజ్యాంగ వ్యవస్ధలను కాపాడాల్సింది పోయి వాటి గొంతునొక్కుతున్నాడని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు.
అమరావతి: రాజ్యాంగ వ్యవస్ధలను కాపాడాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగనే స్వయంగా ఆ వ్యవస్థల గొంతు నొక్కడమే కాదు ఏకంగా మర్డర్ చేస్తున్నారని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. రాష్ట్రంలోని ఐదుకోట్ల మంది ప్రజలు చూస్తుండగా శాసన మండలిపై సీఎం హత్యా యత్నం చేశారంటూ తీవ్ర విమర్శలు చేశారు.
శాసనమండలిని రద్దు చేయడం అంటే ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల గొంతు నోక్కడమేనని అన్నారు. మండలిలో ఎక్కువ మంది సభ్యులు మైనార్టీ వర్గాలకు చెందినవారేనని... వారికి అన్యాయం చేయడం తగదని అన్నారు. మండలిలో మొత్తం 58 మంది సభ్యుల్లో సగానికి పైగా బడుగు బలహీన వర్గాల వారే వున్నారని రామానాయుడు తెలిపారు.
read more జగన్ కు రివర్స్ టెండరింగ్ ద్వారానే బుద్దిచెప్పేది... అదెలాగంటే: వంగవీటి రాధ
మండలి రద్దు ద్వారా తమ సామాజికవర్గానికి అన్యాయం చేసిన సీఎంను బీసీలు క్షమించరని అన్నారు. వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, పోతుల సునీత, శివనాథ రెడ్డిలను వైసిపిలో చేర్చుకున్న జగన్ కు నైతికత ఏముందన్నారు.
కూచిపూడి నాట్యం చేస్తే మడమ ఎన్నిసార్లు తిరుగుతుందో అంతకంటే ఎక్కువ సార్లు జగన్ మడమ తిప్పుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు మండలిని రద్దు చేసిన జగన్ కు రేపో మాపో అసెంబ్లీని కూడా రద్దు చేయాల్సిన పరిస్థితి వస్తుందని రామానాయుడు అన్నారు.
read more వారి స్వార్థం కోసమే పెద్దల సభ... జాతీయ నాయకులు వద్దన్నా...: ధర్మాన