ఆయనకు రాజకీయ భిక్షపెట్టినా తిన్నింటి వాసాలు లెక్కపెట్టారు: టిడిపి ఎమ్మెల్యే ఫైర్

కేబినెట్  హోదా కల్పించి గౌరవించిన తెలుగుదేశం పార్టీని కాదని వైఎస్సార్ కాంగ్రెస్ లోకి  చేరిన కారెం శివాజీ ఓ దళిత  ద్రోహి అని టిడిపి ఎమ్మెల్యే డోలా బాాల వీరాంజనేయ స్వామి ఆరోపించారు. 

tdp mla dola bala veeranjaneya swamy fires on karem shivaji

అమరావతి: తిన్నింటి వాసాలు లెక్కపెట్టే కారం శివాజీ లాంటి వ్యక్తులు కూడా రాజకీయం గురించి, విలువల గురించి మాట్లాడటం సిగ్గు చేటని టిడిపి ఎమ్మెల్యే  డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శించారు. పాముకు పాలుపోసి పెంచినా కాటు వేయాలనే ఆలోచనతోనే ఉంటుందని... అలా నీడనిచ్చిన పార్టీపై విమర్శలు చేయడం శివాజీకే చెల్లిందన్నారు. 

రాజకీయ భిక్షపెట్టి, కీలక పదవిలో కూర్చోబెట్టిన తెలుగు దేశం పార్టీపై శివాజీ విమర్శలు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. బడుగు బలహీన వర్గాలు రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని తపించేవారిలో చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ ముందు వరుసలో ఉంటుందన్నారు.  అందులో భాగంగానే ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ పదవిని శివాజీకి ఇచ్చారని గుర్తుచేశారు.

read more  సరిలేరు నీకెవ్వరు... సినిమా డైలాగులతో జగన్ పాలనపై బుద్దా వెంకన్న సెటైర్లు

ఏకంగా ఆయనకు కేబినెట్‌ హోదా కల్పించి గౌరవించారని పేర్కోన్నారు. అలాంటి చంద్రబాబును కాదని ఎస్సీ, ఎస్టీల ద్రోహి అయిన జగన్మోహన్‌ రెడ్డి పంచన చేరిన నాడే శివాజీ వ్యక్తిత్వం ఏంటో ప్రజలకు అర్ధమైందన్నారు. 

చంద్రబాబు ఆయన్ని అందలం ఎక్కిస్తే ఆ హోదా నుంచి దించేందుకు జగన్ అనుక్షణం ప్రయత్నించారని తెలిపారు. అయినా ఆయన జగన్ పంచన చేరి నీచ రాజకీయాలు చేస్తూ తన విలువలేంటో ప్రజలకు తెలిసేలా చేశారని ఎద్దేవా చేశారు. ఎవరు అధికారంలో ఉంటే వారి పంచన చేరే శివాజీ లాంటి వారు కూడా నీతులు గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారని అన్నారు. 

వ్యక్తిగత హోదా కోసం తప్ప ఎన్నడూ ఎస్సీల అభ్యున్నతి కోసం శివాజీ కృషి చేయలేదన్నారు. ఇప్పుడు కూడా కేవలం అధికారపక్షం నుంచి ఏదో రకంగా లబ్ది పొందాలనే తపన తప్ప ఎస్సీ అభివృద్ధికి కోసం కాదన్నారు. 

read more  భార్యను చంపి, రాత్రంతా శవం పక్కనే నిద్రించి....

దళితుల అభివృద్దే కోరుకుంటే మునుపెన్నడూ చేయనన్ని పథకాలు అమలు చేసి వారి అభ్యున్నతికి పాటుపడిన తెలుగుదేశం పార్టీలోనే ఉండేవారన్నారు. అలా కాకుండా పార్టీ మారి తానేంటో శివాజీ నీరూపించుకున్నారని కొండపి శాసనసభ్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. 
                                     

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios