అమరావతి: రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మపై  టీడీపీ మహిళానేత, పార్టీ అధికారప్రతినిధి దివ్యవాణి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  ఎక్కడా కనీవినీ ఎరుగనివిధంగా, దేశంలో ఎవరికీ పట్టని విధంగా రాష్ట్రానికి దుర్గతిపడితే రాష్ట్రమహిళగా ఆమె స్పందించినతీరు దారుణమని...ఇటీవల ఆమె చేసిన కామెడీషో చూసినవారంతా సిగ్గుతో తలవంచుకుంటున్నారని దివ్యవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆత్మకూరు లోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ...వాసిరెడ్డి పద్మకు రాష్ట్రప్రజల మధ్యలోకి వచ్చే ధైర్యంలేదన్నారు. జగన్‌ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర మహిళలకు కన్నీళ్లే మిగిలాయని... వారి వేదనగురించి పట్టించుకోకుండా అహంకారపూరిత ధోరణితో మాట్లాడటం ఆమెకే చెల్లిందని దివ్యవాణి మండిపడ్డారు. 

read more  హైపవర్ కమిటీ సమావేశం...రాజధానిపై చర్చించిన అంశాలివే

రాష్ట్రప్రభుత్వ నిర్ణయాలవల్లే జాతీయ మహిళా కమిషన్‌ రాష్ట్ర పర్యటనకు వచ్చిందన్న సంగతి మరిచి పద్మ మాట్లాడుతోందన్నా రు. ప్రభుత్వంలో న్యాయముంటే  జాతీయ మహిళాకమిషన్‌ సభ్యులను కలవనీయకుండా రాజధాని మహిళల్ని ఎందుకు అడ్డగించారన్నారు. ప్రతిపక్షసభ్యులుగా టీడీపీ మహిళానేతలు జే.ఏ.సీని కలుపుకొని పోరాటం చేస్తుంటే దాన్నెందుకు ఓర్వలేకపోతున్నారని దివ్యవాణి ప్రశ్నించారు. 

రాష్ట్రమహిళా  కమిషన్‌ పదవిలో ఉండి రాష్ట్ర మహిళల మధ్యకురాలేని దుస్థితిలో ఉన్నందుకు పద్మ సిగ్గుపడాలన్నారు. ఆయుష్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాటిమహిళను కూడా పరామర్శించే ధైర్యం ఆమెకు లేదన్నారు. నేను విన్నాను.. అన్నాను..కన్నానని ఓట్లు అడుక్కున్నవారంతా  రక్షకభటుల సాయంతో  రాష్ట్రాన్ని గుప్పెట్లో పెట్టుకొని రైతులు, మహిళల్ని నక్సలైట్లలా, డెకాయిట్లలా, టెర్రరిస్టుల్లా చూస్తున్నారన్నారు. 

ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న వారిపై 144సెక్షన్‌ పేరుతో  అమానుషానికి పాల్పడ్డారని.. రాష్ట్రంలోని మహిళలంతా రుద్రమదేవిలా, మగువ మాంచాలలా పోరాడే సమయం వచ్చిందన్నారు. ప్రభుత్వమిచ్చే బిస్కట్లకోసం ఉద్యోగులు , ప్రజలు ఆశపడే పరిస్థితిలో లేరన్నారు. జగనన్న బాణాన్ని అనిచెప్పి ఓట్లు అడుక్కున్నది ఎవరో, ఆనాడు రాజన్న బిడ్డనంటూ రాష్ట్రంలో తిరిగిందెవరో పద్మకు తెలియదా అని దివ్యవాణి ప్రశ్నించారు. నోరుందికదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ప్రజలంతా  తగినవిధంగా బుద్ధిచెప్పడం తథ్యమన్నారు.

read more  ఎన్టీఆర్ కు చంద్రబాబు సవాల్... భువనేశ్వరి కోసమే: దాడి వీరభద్రరావు

సినీ ప్రముఖులంతా అమరావతి ఉద్యమానికి మద్ధతివ్వాలి

రాజధాని మహిళలపై జరిగినదాడిని హైకోర్టు సుమోటోగా స్వీకరించడాన్ని స్వాగతిస్తున్నామని, రాష్ట్రప్రజలందరికీ న్యాయం జరుగుతుందన్న నమ్మకం తమకు వచ్చిందని దివ్యవాణి తెలిపారు. తెలుగురాష్ట్రాల్లో ఉన్న సినిమా ప్రముఖులంతా అమరావతి ఉద్యమానికి మద్ధతివ్వాలని ఆమె విజ్ఞప్తిచేశారు. 

అమ్మఒడి పథకం తెచ్చామని, ఇంగ్లీషు మీడియం తీసుకొచ్చామని గొప్పగా చెబుతున్న పాలకులంతా నేడు తమని ఆంగ్లంలో ప్రశ్నిస్తున్నవారంతా ఇదివరకే రాష్ట్రంలోనే ఉండి ప్రతిభాపాటవాలు సాధించారనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. గతంలో రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్మన్‌గా ఉన్న నన్నపనేని రాజకుమారి, జాతీయస్థాయిలో మహిళలకు జరిగిన అన్యాయంపై గళమెత్తారని, ఇప్పుడున్న పద్మ సోషల్‌ మీడియాలో డప్పుకొట్టుకుంటూ కాలం గడుపుతోందని  దివ్యవాణి మండిపడ్డారు.