గుంటూరు: అమరావతి పర్యటనలో టీడీపీ అధినేత ప్రయాణిస్తున్న బస్సుపై జరిగిన దాడి ఘటనపై ప్రభుత్వం సిట్‌(ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని)ను ఏర్పాటు చేయడంపై మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు స్పందించారు. సిట్ విచారణతో పాటే స్వయంగా సీఎం జగన్మోహన్‌రెడ్డే విచారించినా తమకేమీ భయం లేదని.. జరిగిన వాస్తవాలను ప్రజలముందుంచడమే తమకు కావాలని అన్నారు. 

సోమవారం విజయవాడలో అచ్చెన్నాయుడు పార్టీ పొలిట్‌ బ్యూరోసభ్యులు వర్లరామయ్య, ఇతరనేతలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... చంద్రబాబు వాహనంపై జరిగిన దాడిపై కేంద్రానికి ఫిర్యాదు చేయబట్టే విచారణకు సిట్‌ ఏర్పాటు చేశారరు. చంద్రబాబు ప్రయాణిస్తుస్న బస్సుపైకి పోలీస్‌లాఠీ ఎలావచ్చిందో... దాన్ని ఎవరు విసిరారో డీజీపీ సమాధానం చెప్పాలన్నారు. 

ఈ ఘటనకు బాధ్యులెవరు... వారు ఎక్కడినుంచి వచ్చారు... ఎవరి ప్రోద్భలంతో ప్రతిపక్షనేత వాహనంపైకి రాళ్లు, చెప్పులు విసిరారనే విషయాలపై డీజీపీ నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. దాడికి పాల్పడిన వారు తెనాలి, కడప నుంచి వచ్చినట్లు ఒప్పుకున్నారరని... దీన్ని బట్టి వారు ఎవరి మనుషులో అర్థమవుతోందన్నారు. 

read more  పోలీసులూ జాగ్రత్త... మీకు శిక్ష తప్పదు: చంద్రబాబు హెచ్చరిక

నిజంగా రైతులకు చంద్రబాబుపై అంత కోపమే వుంటే కేవలం ఒక్కచోటే నిరసనతెలిపి దాడి చేయరని... అన్ని ప్రాంతాల్లోనూ తిరగబడేవారని అన్నారు. అలాకాకుండా మిగతా రాజధాని ప్రాంతాల్లో దారిపొడవునా టీడీపీ అధినేతకు పూలతో ఘనస్వాగతం లభించిందన్నారు.  

నిరసన వ్యక్తం చేసేహక్కు అందరికీ ఉంటుందని చెబుతున్న డీజీపీ టీడీపీ వారికి కూడా ఆహక్కు కల్పించాలని కోరారు. లేకుంటే ఆయన్ని వైసీపీ కార్యకర్తగా పరిగణించాల్సి వస్తుందన్నారు.

రాజధానిలో టీడీపీ ప్రభుత్వం ఇటుక కూడా వేయలేదని దుష్ప్రచారం చేశారని, చంద్రబాబు పర్యటనతో అక్కడ జరిగిన అభివృద్ధి మొత్తం ప్రపంచానికి తెలిసిందన్నారు. రైతులే స్వయంగా 33వేల ఎకరాలు ఇచ్చిన సంఘటన ఎక్కడా జరగలేదన్నారు. రాజధానిలో 9సిటీలు నిర్మించి, 13జిల్లాల్లో స్మార్ట్ నగరాలను ఏర్పాటుచేసి అభివృద్ధి వికేంద్రీకరణకు చంద్రబాబు శ్రీకారం చుట్టాడన్నారు. 

read more  అమరావతి నిర్మాణం కాదు...ఆ పేరే జగన్ కు నచ్చడంలేదు: వర్ల రామయ్య

రాజధాని ప్రాంతంలో సచివాలయం, హైకోర్టుతోపాటు, అనేకభవనాలు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయడం జరిగిందన్నారు. రాజధాని తరలింపుని నిరసిస్తూ, అమరావతిని అభివృద్ధిచేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 5వ తేదీన అఖిలపక్ష నాయకులతో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నట్లు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అధికార పార్టీ మినహా అన్నిపక్షాలను, ప్రజాసంఘాలను సమావేశానికి ఆహ్వానించామని, అయా పార్టీలు హాజరై తమ అభిప్రాయాలు, సూచనలు చెప్పాలన్నారు.