Asianet News TeluguAsianet News Telugu

ఆ ఒక్క నిర్ణయం... రూ.1.15 లక్షల కోట్ల ఆదాయానికి గండి..: జగన్ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఫైర్

చంద్రబాబునాయుడు హయాంలో  హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ నిర్మించినందువల్ల మైండ్‌ స్పేస్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు వచ్చాయని గుర్తుచేశారు. ఇలాగే అమరావతిని కూడా తీర్చిదిద్దాలని చంద్రబాబు కలలు కన్నారని...వాటిని జగన్ నాశనం  చేస్తున్నారని మండిపడ్డారు.    

tdp leader amarnath reddy comments on cm YS Jagan Mohan reddy decisions
Author
Guntur, First Published Nov 12, 2019, 9:33 PM IST

అమరావతి: వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకున్న వ్యాపారవేత్తలు వెనక్కుతగ్గుతగ్గి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారని మాజీ మంత్రి, టిడిపి నాయకులు అమర్‌నాథ్‌రెడ్డి ఆరోపించారు. వైసిపి ప్రభుత్వ నిర్ణయాలు పారిశ్రామికీకరణకు గొడ్డలిపెట్టని అన్నారు. 

సీఎం వైఎస్‌ జగన్ ప్రభుత్వ వైఫల్యం వల్ల సింగపూర్‌ ప్రభుత్వం అమరావతి రాజధాని నగరం స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్ట్‌ని ఉపసంహరించుకుందన్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం, సింగపూర్‌ కన్సార్టియం మధ్య కుదిరిన ఒప్పందం రద్దయిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాజధాని విషయంలో తన ప్రాధాన్యతను మార్చుకోవడం వలనే అమరావతి స్టార్టప్‌ ఏరియాలో తమ పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నట్లు సింగపూర్‌ పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రెస్‌ నోట్‌లో తెలిపిందని అన్నారు.

 విదేశీ మార్కెట్లలో కొన్ని మిలియన్‌ డాలర్ల పెట్టుబడి నిర్ణయాలలో అక్కడి ప్రాంతీయ ప్రభుత్వాల ప్రాధాన్యత మార్పు ప్రభావితం చేస్తాయని ఆ శాఖ మంత్రి ఈశ్వరన్‌ తెలిపినట్లు పేర్కొన్నారు. ఆ ఒప్పందం చేసుకున్నవారిపై నిందలు వేయడం, ప్రాధాన్యతలు మార్చుకోవడం వంటి మన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు పారిశ్రామికీకరణకు గొడ్డలిపెట్టని ఆరోపించారు.

read more  హిందూమతంపై జగన్ సర్కార్ దాడి...వారి టార్గెట్ అదే...: బోండా ఉమ

ఒక 'స్టార్ట్‌ అప్‌' నగరాన్ని నిర్మించేందుకు సింగపూర్‌ కన్సార్టియంతో స్విస్‌ చాలెంజ్‌ టెండర్‌ ప్రక్రియ ద్వారా ఈ ఒప్పందం కుదిరిందని... 1691 ఎకరాల్లో 3 దశల్లో, 15 సంవత్సరాల్లో నగరం అభివృద్ధి చెందేదన్నారు. దీని ద్వారా ప్రపంచ స్థాయి కంపెనీల రాక, ఉద్యోగాల కల్పన, మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ క్వాలిటీ నిర్మాణాలు, లివింగ్‌ స్పేస్‌, బిజినెస్‌ పార్కులు, ఐటీ పార్కులు, బీటీ పార్క్‌, ఫైనాన్స్‌ డిస్ట్రిక్ట్‌ వంటివి ఏర్పడేవని పేర్కొన్నారు.  

దీనివల్ల 25 లక్షల మందికి ప్రత్యక్షంగా, 10 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభించేదన్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తికి రూ.1.15 లక్షల కోట్ల అదనపు రాబడి, ప్రభుత్వ ఖజానాకి 8వేల నుంచి 10వేల కోట్లు పన్నుల రూపేణా రాబడి వస్తుందని అంచనా వేశారు. ఈ నగర నిర్మాణం జరిగితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి ఉపయోగపడేదన్నారు.

చంద్రబాబునాయుడు హయాంలో  హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ నిర్మించినందువల్ల మైండ్‌ స్పేస్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు వచ్చాయని గుర్తుచేశారు. ఐటీ పరిశ్రమ బాగా విస్తరించిందని...ఎగుమతులు పెరిగాయని లక్షల ఉద్యోగాలు లభించాయన్నారు. పన్నుల రూపంలో, ఇతర మార్గాలలో ప్రభుత్వ ఆదాయం పెరిగిందన్నారు. 

read more  వైసిపి నేతలు గుడ్డలూడదీయడంలో మంచి అనుభవజ్ఞులు...: కాలవ షాకింగ్ కామెంట్స్

 ప్రస్తుతం తెలంగాణ ఆదాయంలో 50 శాతం పైగా ఒక్క హైదరాబాద్‌ నగరం నుంచే వస్తోందని.. ఆ ఆదాయాన్ని రాష్ట్రంలోని మొత్తం జిల్లాలలో ఖర్చు చేస్తున్నారన్నారు. అలాగే అమరావతిలో 'స్టార్ట్‌ అప్‌' నగర నిర్మాణం పూర్తి అయి ఉంటే సైబరాబాద్‌ మాదిరిగా లక్షల సంఖ్యలో యువతకు ఉద్యోగాలు లభించేవని..దీనద్వారా ప్రభుత్వానికి ఆదాయం భారీగా పెరిగేదని పేర్కొన్నారు. 

 ఆ ఆదాయాన్ని 13 జిల్లాల అభివృద్ధికి వినియోగించడానికి అవకాశం ఉండేదన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్లే ఇలా జరిగిందని.. ప్రభుత్వ అనాలోచిత విధానాలు రాష్ట్రాభివృద్ధిని దెబ్బతీస్తున్నాయని అమర్‌నాథ్ రెడ్డి ఆరోపించారు. 

   

Follow Us:
Download App:
  • android
  • ios