నూతన సంవత్సర వేడుకలకు చంద్రబాబు దూరం...ఎందుకంటే

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఈసారి నూతన సంవత్సర వేడుకలకు దూరంగా వుండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.  

TDP chief chandrababu naidu away from new year celebration

అమరావతి రైతుల ఆందోళనల నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు. జనవరి ఒకటవ తేదీన సంబరాలకు దూరంగా వుండనున్న చంద్రబాబు రాజధాని రైతులతో కలిసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

అమరావతి రైతుల ఆందోళనల నేపథ్యంలో చంద్రబాబు  ఎర్రబాలెం, కృష్టయపాలెంలో, మందడంలో పర్యటించనున్నారు. ఉదయం 9:30  ఎర్రబాలెంలో చంద్రబాబు పర్యటన ప్రారంభంకానుంది.  అక్కడినుండి క్రిష్ణాయపాలెం, మందడంలో పర్యటించనున్నారు. 

గుంటూరు జైలులో ఉన్న ఆరుగురు రైతులను ఇటీవలే చంద్రబాబు పరామర్శించారు. రాజధానిని అమరావతి నుండి మార్చకూడదని డిమాండ్ చేస్తూ 12 రోజులుగా అమరావతి పరిసర ప్రాంతాల రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఆందోళనకు దిగిన పలువరు రైతులపై పోలీసులు కేసులు పెట్టారు. ఈ కేసుల్లో భాగంగానే పోలీసులు  ఆందోళన చేస్తున్న రైతులపై అరెస్ట్ చేశారు. 

వీరిని గుంటూరు జైలులో పెట్టగా తాజాగా  చంద్రబాబు వారిని కలుసుకున్నారు. జైలు బయటకు వచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రైతులను అరెస్టు చేయడం  సిగ్గుచేటన్నారు. రైతులపై 307సెక్షన్ కింద కేసులు పెడతారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

read more  రాజధానిగా అమరావతికున్న చట్టబద్దత ఇదే...: ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్

 రాజధాని రైతులు ఏ మరణాయధాలతో దాడులు చేశారో చెప్పాలని నిలదీశారు. అర్ధరాత్రి దొంగలను తీసుకోచ్చినట్లు అన్నదాతలను అరెస్టులు చేస్తారా అంటూ పోలీసులపై మండిపడ్డారు. రాజధాని గ్రామాల ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడానికి ప్రభుత్వమే ఇందంతా చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు.

రాజధాని రైతుల అరెస్టులు, ప్రజల ఉద్యమాన్ని అణచివేడయం ఇదంతా సిఎం జగన్ కనుసన్నల్లో జరుగుతోందన్నారు. రైతులపై ఎందుకు అటెంటు మర్డర్ కేసులు పెట్టారో డిజిపి చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 

read more  పవన్ నిజంగానే తిక్కలోడు...: వైసిపి ఎమ్మెల్యే ఘాటు విమర్శలు

రైతులు ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారని... రాజధాని మారిస్తే తమ బతుకులు ఏమవుతాయోనని రైతులు భయపడుతున్నారని అన్నారు. అమరావతి రాజధాని మార్చమని ఎవరు అడిగారని...ఇప్పటికయినా సిఎం జగన్ అమరావతి రాజధాని కొనసాగుతుందని చెప్పాలని చంద్రబాబు సూచించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios