గుంటూరు: గుంటూరు జిల్లాలోని అరండల్ పేటలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన వైసీపీ బాధితుల శిబిరంలో ఉన్నవారిని పోలీసులు స్వగ్రామానికి తరలించారు. బాధితులతో ఆర్డీవో చర్చలు సఫలం కావడంతో వారు స్వగ్రామం వెళ్లేందుకు అంగీకరించారు. 

వైసీపీ బాధితుల శిబిరంలో మెుత్తం ఐదు గ్రామాలకు చెందిన వారు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిని వారి స్వగ్రామాలకు ప్రత్యేక బస్సుల్లో తరలించారు. ఇకపోతే రెండు రోజులుగా అరండల్ పేటలోని వైసీపీ బాధితుల శిబిరం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

మంగళవారం నుంచే బాధితులను స్వగ్రామాలకు తరలిస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో తెలుగుదేశం పార్టీ నేతలు శిబిరం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే పోలీసులు వారితో చర్చలు జరిపినా వినలేదు. 

చలో ఆత్మకూరు పిలుపు నేపథ్యంలో టీడీపీ నేతలు బుధవారం ఉదయమే బాధితుల వద్దకు చేరుకున్నారు. భారీ సంఖ్యలో పోలీసులు శిబిరం వద్దకు చేరుకుని టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు. అనంతరం ఆర్డీవో బాధిుతలతో చర్చలు జరిపారు. చర్చలు సఫలం కావడంతో వారిని స్వగ్రామాలకు తరలించారు.  

ఈ వార్తలు కూడా చదవండి

గుంటూరులో టెన్షన్: టీడీపీ నేతల ముందస్తు అరెస్ట్

తాడోపేడో తేల్చుకుంటాం, వదిలిపెట్టను: జగన్ సర్కార్ పై చంద్రబాబు గరంగరం

వేడెక్కిన పల్నాడు: టీడీపీకి పోటీగా.. రేపు వైసీపీ చలో ఆత్మకూరు