గుంటూరు: గుంటూరు జిల్లాలో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ కు సోమవారం నాడు తృటిలో ప్రమాదం తప్పింది. దీంతో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలును గుంటూరు రైల్వేస్టేషన్‌లో అధికారులు నిలిపివేశారు.

భువనేశ్వర్ నుండి బెంగుళూరుకు వెళ్తున్న ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ వెళ్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు ఏసీ కోచ్ చక్రం బోల్డ్ ఊడిపోవడంతో రైలును గుంటూరు రైల్వేస్టేషన్‌లో నిలిపివేశారు.ఏసీకోచ్ ను రైలు నుండి విడదీసి మరో బోగిని అమర్చారు రైల్వే సిబ్బంది.ఈ విషయాన్ని గమనించకపోతే పెద్ద ప్రమాదం జరిగేదని రైల్వే అధికారులు అభిప్రాయపడుతున్నారు.

also read:కేరళ ఎక్స్ ప్రెస్ కు తప్పిన పెను ప్రమాదం: ప్రయాణికులుసేఫ్

గుంటూరు రైల్వేస్టేషన్‌లోనే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలును అధికారులు మూడు గంటలపాటు నిలిపివేశారు. దీంతో ప్రయాణీకులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. రెండు రోజుల క్రితం చిత్తూరు జిల్లా ఏర్పేడు సమీపంలో కేరళ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.

కేరళ ఎక్స్‌ప్రెస్ ఢిల్లీ నుండి త్రివేండ్రం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంబవించలేదు. రేణిగుంట జంక్షన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

తరచూ ప్రమాదాలు జరగడంతో ప్రయాణీకులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వారం రోజుల క్రితం హంద్రీ ఎక్స్‌ప్రెస్ రైలును కాచిగూడ రైల్వేస్టేషన్ సమీపంలోనే ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి.ఈ ప్రమాదానికి ఎంఎంటీఎస్ రైలు డ్రైవర్ చంద్రశేఖర్ కారణంగా రైల్వే ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన లోకో పైలట్ చంద్రశేఖర్ ఈ నెల 16వ తేదీ రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.రేపు చంద్రశేఖర్ అంత్యక్రియలు పశ్చిమగోదావరి జిల్లాలోని ఆయన స్వగ్రామంలో జరుగుతాయి.