తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా ఏర్పేడు సమీపంలో రైలు ప్రమాదం ముప్పు తప్పింది. కేరళ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. అయితే, ప్రాణ నష్టమేమీ సంభవించలేదని తెలుస్తోంది. 

కేరళ ఎక్స్ ప్రెస్ ఢిల్లీ నుంచి త్రివేండ్రం వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.  ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. రేణిగుంట జంక్షన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. రైలు 82వ బోగీ పట్టాలు తప్పింది. వివరాలు అందాల్సి ఉంది.