Asianet News TeluguAsianet News Telugu

రహదారిపై రోడ్డుప్రమాదం.. ఎనిమిది మందిని డీ కొట్టిన లారీ

గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమదాహం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అతివేగం కారణంగా ఒకరు మృత్యువాత పడ్డారు.  తిమ్మాపురం వద్ద జాతీయ రహదారి పై చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

road accident at guntur national highway
Author
Hyderabad, First Published Nov 11, 2019, 9:24 PM IST

గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమదాహం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అతివేగం కారణంగా ఒకరు మృత్యువాత పడ్డారు.  తిమ్మాపురం వద్ద జాతీయ రహదారి పై చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనతో ఒక్కసారిగా రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

గాయపడిన వారిని హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. యడ్లపాడు మండలం , తిమ్మాపురం వద్ద జాతీయ రహదారి పై తమిళనాడు కు చెందిన ఇనుప లోడు లారీ అదుపు తప్పి డీవైడర్ పై దూసుకెళ్తూ ఎనిమిది మంది వ్యక్తులను డీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా ముగ్గురి పరిస్థితి విషమంగ ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను గుంటూరు జి జి హచ్ కి తరలించారు. 

also read: కూతురు వరసయ్యే.. మైనర్ బాలికపై అత్యాచార యత్నం.

వరసకు కూతురౌతుంది. అందులోనూ మానసికంగా పూర్తిగా ఎదగని పిల్ల. కంటికి రెప్పలా కాపాడ్సాలిందిపోయి... నాగుపాములా కాటు వేయాలని చూశాడు. అభం శుభం తెలియని చిన్నారి అని కూడా చూడకుండా... అత్యాచారానికి యత్నించాడు. కాగా... బాలిక తృటిలో ఆ మృగాడి నుంచి బయటపడింది. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం కొండూరు గ్రామానికి చెందిన కుంభా నరసింహారావు(34) అనే వ్యక్తి లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల వరకు కూతురయ్యే మైనర్ బాలిక(12) పై అతని కన్ను పడింది. బాలిక మానసిక పరిస్థితి అంత మెరుగ్గా ఏమీ లేదు. ఈ నేపథ్యంలో... దానిని అతను అదునుగా చేసుకున్నాడు.

ఎవరూలేని సమయంలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా... అతను చేసిన పని నచ్చకపోవడంతో బాలిక గట్టిగా కేకలు వేసింది. గమనించిన స్థానికులు అక్కడికి చేరుకోగా... నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

కాగా.. స్థానికులు బాలికను రక్షించారు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడుని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios