వరసకు కూతురౌతుంది. అందులోనూ మానసికంగా పూర్తిగా ఎదగని పిల్ల. కంటికి రెప్పలా కాపాడ్సాలిందిపోయి... నాగుపాములా కాటు వేయాలని చూశాడు. అభం శుభం తెలియని చిన్నారి అని కూడా చూడకుండా... అత్యాచారానికి యత్నించాడు. కాగా... బాలిక తృటిలో ఆ మృగాడి నుంచి బయటపడింది. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం కొండూరు గ్రామానికి చెందిన కుంభా నరసింహారావు(34) అనే వ్యక్తి లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల వరకు కూతురయ్యే మైనర్ బాలిక(12) పై అతని కన్ను పడింది. బాలిక మానసిక పరిస్థితి అంత మెరుగ్గా ఏమీ లేదు. ఈ నేపథ్యంలో... దానిని అతను అదునుగా చేసుకున్నాడు.

ఎవరూలేని సమయంలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా... అతను చేసిన పని నచ్చకపోవడంతో బాలిక గట్టిగా కేకలు వేసింది. గమనించిన స్థానికులు అక్కడికి చేరుకోగా... నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

కాగా.. స్థానికులు బాలికను రక్షించారు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడుని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.