హాయి ల్యాండ్ లో అక్రమంగా వెలిసిన కోవిడ్ సెంటర్... అధికారుల దాడులు (వీడియో)
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చిన్నకాకని హాయి ల్యాండ్ లో అనధికారికంగా నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్ పై అధికారులు దాడులు చేపట్టారు.
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చిన్నకాకని హాయి ల్యాండ్ లో అనధికారికంగా నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్ పై అధికారులు దాడులు చేపట్టారు. పోలీస్, రెవెన్యూ అధికారుల పక్కా సమాచారంతో మెరుపు దాడికి దిగారు. దీంతో నిర్వమకులు, సిబ్బందితో పాటు కొంత మంది రోగులు పరారవగా మిగిలిన వారిని అధికారులు విచారిస్తున్నారు.
గతంలో చిన్న కాకాని ఎన్నారై ఆసుపత్రిలో పనిచేసి బయటకు వచ్చిన వ్యక్తి ఆధ్వర్యంలో అనధికారికంగా కోవిడ్ సెంటర్ నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. ఆ వ్యక్తి ఒక్కొక్క బాధితుని వద్ద 30 వేల రూపాయలు వసూలు చేశారని తెలుస్తోంది. ఏదేమైనా కరోనా వైద్యం పేరుతో ప్రజల సొమ్ము దోపిడీ చేయడం చర్చనీయాంశమైంది.
read more ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ కు కరోనా పాజిటివ్
కాగా అనధికార కోవిడ్ సెంటర్ నిర్వహిస్తున్న వ్యక్తి డాక్టర్ కాదని తెలుస్తోంది. ఈ విషయం జిల్లా స్థాయి అధికారులకు తెలియటంతో ఒక్కసారిగా దాడులు చేసినట్లుగా తెలిసింది. లోపల అనధికారికంగా కోవిడ్ బాధితులకు చికిత్స చేస్తున్నట్లుగా తగిన ఆధారాలు అధికారులకు దొరికాయి.
"
హాయ్ ల్యాండ్ సెంటర్ వద్ద అనధికారికంగా కోవిడ్ బాధితులకు చికిత్స చేయటానికి ఎలా అద్దెకు ఇచ్చారు తెలియాల్సి వుంది. దీనికి లక్షల్లో చేతులు మారాయని విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులు, రెవెన్యూ అధికారులు నిస్పక్షపాతంగా దర్యాప్తు చేస్తే దీని వెనుక అసలు నిజం బయట పడుతుందని అంటున్నారు.