అమరావతి:  రివర్స్ టెండరింగ్ ద్వారా మరోసారి రాష్ట్రానికి లాభం చేకూరిందని వైసిపి ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రామ, వార్డు వాలంటీర్ల కోసం కోనుగోలు చేయనున్న సెల్ పోన్ల విషయంలో రివర్స్ టెండరింగ్ నిర్వహించి భారీ ప్రజాధనాన్ని ఆదా చేసినట్లు ఏపి ప్రభుత్వం తెలిపింది. దీనిపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. 

''వినేవాళ్లు అమాయకులయితే చెప్పేవారు వైఎస్ జగన్ గారు అన్నట్టుంది పరిస్థితి. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి నిధులు లేవని దొంగ ఏడుపులు ఏడుస్తున్న జగన్ గారు వైకాపా కార్యకర్తలకు సెల్ ఫోన్లు కొనడానికి రూ.233 కోట్ల ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు?''

''గ్రామ వాలంటీర్లు అని పేరు మార్చిన వైకాపా కార్యకర్తల కోసం ఫోన్లు కొంటూ రివర్స్ టెండర్ లో రూ.83 కోట్లు ఆదా అంటూ చెవిలో క్యాబేజీ పెట్టారు జగన్ గారు. వైకాపా ప్రభుత్వం టెండర్లు పిలిస్తే, రెండు సార్లూ ఒకే కంపెనీ టెండర్ వేసింది.''

''ఈ స్కీంలో రూ.233 కోట్ల ప్రజాధనానికి జగన్ గారు టెండర్ పెట్టడం తప్ప రివర్స్ టెండరింగ్ ఎక్కడ ఉంది?ఇకపోతే జగన్ గారి పారదర్శకత ప్రకారం రూ.100కోట్లు దాటిన టెండర్లకు జ్యూడిషయల్ ప్రివ్యూ జరగాలి. మరి ఫోన్ల టెండర్లను ప్రివ్యూకు పంపలేదే? అంటే జే ట్యాక్స్ కడితే ప్రివ్యూ ఉండదా జగన్ గారు?'' అంటూ ట్విట్టర్ వేదికన లోకేష్ సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు.  

read more  రివర్స్‌ టెండరింగ్‌ మరోసారి బిగ్‌ హిట్‌ ...భారీ ప్రభుత్వ ధనం ఆదా

గ్రామ, వార్డు వాలంటీర్ల కోసం కొనుగోలుచేయాలని భావించిన సెల్ ఫోన్ల కోసం ఇదివరకే వైసిపి ప్రభుత్వం బిడ్డింగ్ నిర్వహించింది. అయితే తాజాగా మరోసారి రివర్స్ టెండరింగ్ నిర్వహించగా దాదాపు రూ.83 కోట్లు ఆదా అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 

 గ్రామ,వార్డు వాలంటీర్ల కోసం 2,64,920 సెల్‌ఫోన్లను ఏపీటీఎస్‌ ద్వారా కొనుగోలు చేయాలని  ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం నవంబర్‌ 30న తొలిదశ బిడ్డింగ్‌ తెరిచారు. ఇందులో రూ. 317.61 కోట్లకు ఓ కంపనీ కోట్‌చేసి ఎల్‌–1 గా నిలిచింది. దీనిపై ఏపిటిఎస్ రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించగా రూ.233.81 కోట్లకు కోట్‌ చేసిన కంపనీ బిడ్‌ దక్కించుకుంది. రివర్స్‌టెండరింగ్‌లో 26.4 శాతం తక్కువకు దక్కించుకు దక్కించుకుంది. 

 తొలిదశ బిడ్డింగ్‌ కన్నా రూ. 83.8 కోట్ల మేర తక్కువకు కోట్‌ చేసిన కంపనీ దీన్ని దక్కించుకుంది. ఇలా ఏపీటీఎస్‌ టెండర్లలో భారీగా ప్రజా ధనం ఆదా అయి రివర్స్‌ టెండరింగ్‌ మరోసారి బిగ్‌ హిట్‌  అయినట్లు ప్రభుత్వం తెలిపింది. 

read more  దిశపై అఘాయిత్యం... నిందితులకు కఠిన శిక్ష పడకూడదనే పవన్ ఆలోచన: ఏపి హోంమంత్రి

గ్రామ, వార్డు వాలంటీర్లకు అందించనున్న ఈ సెల్‌ఫోన్‌ లకు ఒక ఏడాది పాటు వారెంటీ, 3 జీబీ ర్యాం, 32 జీబీ మెమరీ, ఆక్టాకోర్‌ ప్రొసెసర్‌ ను కలిగివున్నాయి. దీంతోపాటు మొబైల్‌ సాఫ్ట్‌వేర్‌ను కూడా  సదరు కంపనీయే నిర్వహించనుంది. 

మూడేళ్లపాటు మాస్టర్‌  డేటా మేనేజ్‌మెంట్, టైప్‌ ‘‘సి’’ లేదా మైక్రో యూఎస్‌బీ టూ మైక్రో యూఎస్‌బీ కన్వెర్టర్, టెంపర్డ్‌ గ్లాస్, బ్యాక్‌ కవర్,రెండు, మూడో సంవత్సరాల్లో కూడా మెయింటినెన్స్, వాకిన్‌ సపోర్ట్‌ ను బిడ్ దక్కించుకున్న కంపనీ  అందించనుంది.