అమరావతి: కలానికి సంకెళ్లు... పత్రికా స్వేచ్చకు కళ్లెం.....రెండు  రోజులుగా కొన్ని పత్రికలు, చానళ్ళలో ఆకర్షణీయమైన హెడ్డింగ్స్ చూస్తున్నామని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి 
పేర్ని నాని తెలిపారు. అయితే వీరు రాసినట్లు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వల్ల మీడియా స్వేచ్చకువ ఎలాంటి భంగం కలగడం లేదని తెలిపారు.  
 
కేంద్ర చట్టాల ప్రకారమే పత్రికల నియంత్రణ ఉంటుందని తెలిపారు. పత్రికల్లో ఏ వార్త, ఎప్పుడు, ఎక్కడ రాయాలో నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని...అందంతా కేంద్ర పరిధిలోని అంశమన్నారు. ఆర్టికల్ 19(A)ప్రకారం రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్ట్ ల స్వేచ్ఛ కు వచ్చిన ముప్పు ఏమి లేదని మంత్రి స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన జీఓ పత్రికా స్వేచ్ఛకు విఘాతం కాదన్నారు. రాజకీయ దురుద్ధేశాలతో ప్రభుత్వంపై నిరాధార వార్తలు రాస్తే సంబంధిత కార్యదర్శి స్పందనను ప్రచురించాలని జీఓ చెబుతోందన్నారు. సంబంధిత శాఖ కార్యదర్శి తన వివరణ ప్రచురించకపోతే న్యాయస్థానంను ఆశ్రయించేందుకు అనుమతించామన్నారు. 

read more  కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.... ఇద్దరు మృతి

రాష్ట్రంలోని కొన్ని పత్రికా యాజమాన్యాలు సుప్రీంకోర్టు కన్నా తామే ఉన్నతులమన్న భావనలో ఉన్నాయన్నారు. దేశంలోని మీడియా, రాష్ట్రంలోని మీడియా వేరువేరు విధంగా పనిచేస్తున్నాయని...ముఖ్యంగా రాష్ట్రాల్లోని మీడియాకు రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయని ఆరోపించారు.

కొన్ని మీడియా సంస్థలు దురుద్ధేశపూరితంగా వార్తలు రాసి రిజాయిన్డెర్ ఇస్తే వాటిని ప్రచురించకపోతే ఏం చేయాలని అన్నారు. ప్రజలు మీడియా తీరును గమనించాలని...ఏ మీడియా ఎవరి పక్షాన నిలబడి రాస్తున్నాయో ప్రజలు పరిశీలించాలని అన్నారు.

read more  జగన్ రాజీనామా చేయాల్సిందే...కానీ ఆయనేం నీలం కాదుగా...: సోమిరెడ్డి

మరో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ...కలానికి సంకెళ్లు కాదు కులానికి సంకెళ్లు అనే భావనలో పత్రికాధిపతులు ఉన్నారన్నారు. ఏళ్ల కాలం తమ కులమే రాజ్యం చేయాలనే భావనలో మీడియా యజమానులు చూస్తున్నారని ఆరోపించారు. 

ఎలక్ట్రిక్  బస్సుల కొనుగోలులో అప్పటి ఎండి సురేంద్రబాబు సహకరించలేదని ప్రభుత్వం బదిలీ చేసారని తప్పుడు వార్త రాసారని అన్నారు. ఆ తప్పుడు వార్తపై రవాణా శాఖ కార్యదర్శి, సురేంద్ర బాబులు రిజాయిన్డెర్ ఇచ్చినా ప్రచురించి లేదని గుర్తుచేశారు. తప్పుడు వార్తలు కావాలని రాస్తే కోర్ట్ లకు వెళ్ళమని సంబంధిత శాఖ కార్యదర్శలకు అనుమతించామని తెలిపారు.

కాలానికి సంకెళ్లు కాదు కులానికి...తప్పుడు వార్తలు రాసే వారికి సంకెళ్లు వేయిస్తున్నామని పేర్కొన్నారు. నీతి నిజాయితీ ఉన్న పత్రికలు.. జర్నలిస్ట్ లకు ఎటువంటి ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారు. మా కులమే ఉండాలి...చంద్రబాబు శాశ్వత సీఎంగా ఉండాలనే వారికే సంకెళ్లని అన్నారు. ప్రజలు, మీడియా అధిపతులు వాస్తవాన్ని అర్థం చేసుకోవాలని కొడాలి నాని సూచించారు.