విజయనగరం: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి విమర్శలు చేశారు. రాజధానిలో ఏమి చూడటానికి వస్తున్నారని ప్రశ్నించారు. 5 ఏళ్లలో చంద్రబాబు వల్ల జరిగిన నష్టం 20 ఏళ్లలో కూడా పూడదన్నారు. 

రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర చంద్రబాబుదని మంత్రి విమర్శించారు. రాజధానిలో నిర్మాణాలు ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. యనమల రామకృష్ణుడులా తాను దోచుకోలేదని బర్తరఫ్‌ చేయాలా? అని ప్రశ్నించారు. 

కొన్ని పత్రికలు తమపై ఇష్టానుసారంగా రాస్తున్నాయని మంత్రి బొత్స మండిపడ్డారు. వేల కోట్ల రూపాయలు అప్పు చేసి రాజధానిలో ఏం సంపద సృష్టించారని ప్రశ్నించారు. సింగపూర్‌ కన్సార్టియంతో ఒప్పందం లోపభూయిష్టమని, పరస్పర అంగీకారంతోనే సింగపూర్‌ కన్సార్టియం తప్పుకుందని బొత్స చెప్పారు.

read more  అది బొత్సా దిగజారుడుతనానికి నిదర్శనం: సోమిరెడ్డి

అమరావతిపై ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై ఇటీవలే మాజీమంత్రి, టిడిపి నాయకులు యనమల రామకృష్ణుడు మండిపడ్డారు.  రాజధానిపై మంత్రి బొత్స వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. రాజధానిని స్మశానంతో పోల్చడం గర్హనీయమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి బొత్సను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. 
ప్రజా దేవాలయంగా భావించే శాసన సభను స్మశానంతో పోల్చుతారా..? అంటూ మండిపడ్డారు.

న్యాయ దేవాలయం హైకోర్టును స్మశానంతో పోల్చుతారా..? సచివాలయం వీళ్ల కళ్లకు స్మశానంలా కనిపిస్తోందా..?  అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో 29 గ్రామాలను స్మశానంతో పోలుస్తారా..? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

33వేల ఎకరాలిచ్చిన రైతుల త్యాగాలను అవహేళన చేసేలా మాట్లాడతారా అంటూ మండిపడ్డారు. బొత్స సత్యనారాయణను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని లేకపోతే స్మశానం వ్యాఖ్యల వెనుక సీఎం జగన్ ప్రోద్భలం ఉన్నట్లేనంటూ చెప్పుకొచ్చారు. 

read more  బొత్సాగారి మెదడు అరికాల్లో ఉంది: నారా లోకేశ్

మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎం వైఎస్ జగన్ ఎక్కడ కూర్చుంటున్నారు..? స్మశానంలోనే రోజూ కూర్చుంటున్నారా..? పరిపాలన ఎక్కడ నుంచి చేస్తున్నారు..? స్మశానంలో కూర్చుని పాలన చేస్తున్నారా..? అంటూ జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు మాజీమంత్రి యనమల రామకృష్ణుడు. ఈ వ్యాఖ్యలపై తాజాగా బొత్స కూడా స్పందిస్తూ యనమల అవినీతిపై ప్రశ్నించారు.