అమరావతి: యావత్ భారతదేశం గుర్తించిన ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి వైఎస్సార్‌‌సిపి నాయకులు, ప్రభుత్వ పెద్దలకు మాత్రం స్మశానంలా కనిపిస్తుండటం దారుణమని టిడిపి నాయకులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.  ఏకంగా మంత్రి బొత్సా సత్యనారాయణ అమరావతిని స్మశానంతో పోల్చటం చాలా బాధాకరమని అన్నారు. ఇది ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమంటూ బొత్సాపై సోమిరెడ్డి ఫైర్ అయ్యారు.  

గత ప్రభుత్వ హయాంలో తాము మొదలుపెట్టిన అభివృద్ది పనులను నిలిపివేసి రాజధానిని నిర్వీర్యం చేసిన వారే ఇప్పుడిలా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెబితే ఆయనకు గౌరవంగా ఉంటుందని సోమిరెడ్డి పేర్కొన్నారు.

READ MORE   బొత్సాగారి మెదడు అరికాల్లో ఉంది: నారా లోకేశ్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి బొత్సాపై టిడిపి నాయకులు ఫైర్ అవుతున్నాయి. టిడిపి ప్రభుత్వం రాజధాని  నిర్మాణంలో అవకతవకలకు పాల్పడి బడ్జెట్, ల్యాండ్ పూలింగ్ వంటి విషయాల్లో  పారదర్శకత పాటించలేదన్నది బొత్సా వాదన. దీంతో ఆయన అమరావతిని  స్మశానంలో పోల్చడం వివాదానికి కారణమయ్యింది.   

దీంతో ఆయనపై తెదేపా నాయకులు విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ కూడా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. ఇందులో భాగంగా "ఇన్ని రోజులూ  ఇన్నాళ్ళూ బొత్సాగారి మెదడు అరికాల్లో ఉంది అనుకున్నా... అసలు మెదడే లేదని నిన్న ఇచ్చిన స్టేట్ మెంట్ తో తేలిపోయింది. అయినా బొత్సాగారికి తెలియదు, చెప్పినా అర్థం కాదు. అందుకే అమరావతిని, శ్మశానంతో పోల్చి ప్రజా రాజధానిని అవమానపరుస్తున్నారు." అంటూ బొత్సా సత్యనారాయణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

READ MORE  టీడీపీకి మరో అస్త్రాన్ని అందించిన బొత్స: ఇక చంద్రబాబు దూకుడే....

అయినా తాము అమరావతిని నిర్మించడానికి పడిన కష్టం వైకాపా నేతలు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అన్నారు. అంతేగాక ఈ విషయాన్ని ఉద్దేశించి "ల్యాండ్ పూలింగ్ దగ్గర నుండి, రైతుల ప్లాట్లు తిరిగి ఇవ్వడం, మౌలిక వసతుల కల్పన వరకూ అన్నీ దేశంలో ఉత్తమ ఆలోచనలుగా ప్రశంసలు అందుకుంటుంటే వైకాపా నేతలు మాత్రం కూర్చున్న చెట్టునే నరికేసుకుంటున్నారు." అంటూ వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.