గుంటూరు: రాజధాని గత మూడు వారాలుగా అమరావతి ప్రాంత ప్రజలు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వివిధ రూపాల్లో తమ నిరసనలు తెలిపిన రైతులు, ప్రజలపై పోలీస్ చర్యలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు హింసాత్మక ఘటనలకు కారణమైన వారిపై కేసులు పెట్టి అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపైనా కేసులు నమోదయ్యాయి. 

గుంటూరు జిల్లా లోని జాతీయ రహదారి దిగ్బందించిన ఘటనపై స్థానిక పోలీసుల చర్యలు ప్రారంభించారు.  ఆందోళనలో పాల్గొన్న 18మందిపై కేసులు నమోదు చేసినట్లు మంగళగిరి పోలీసులు తెలిపారు. బాధ్యులపై ఐపీసీ 120b,143,341,353,506 సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. చినకాకాని విఆర్వో కొండవీటి దుర్గారావు ఫిర్యాదు మేరకు కేసు పెట్టి ఎఫ్ఐఆర్  నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కేసులు నమోదయిన వారి పేర్లు

బెజవాడ నరేంద్ర, వాకచర్ల వీరాంజనేయులు, ఆలూరి శ్రీనివాసరావు, పువ్వాడ సుధాకర్, ఆలూరు సుబ్రహ్మణ్యం, మాదాల వెంకటేశ్వరరావు, వడ్లమూడి నాగమల్లేశ్వరరావు, కొండేపాటి సతీష్ చంద్ర, గడ్డం మార్టిన్, బేతపూడి సుధాకర్ , యుగలాదాస్ సుబ్రహ్మణ్యం, మట్టుపల్లి గిరీష్, యుగలాదాస్ రాజప్ప, కొండేటి మరియదాసు, కొండేటి తిమోతి, ఆలూరు యుగంధర్, ఆకుల ఉమ, పత్తిపాటి అంజిబాబులపై కేసులు నమోదయినట్లు పోలీసులు ప్రకటించారు. 

read more  200 కోట్ల ఆదాయాన్ని కాదని... వారికోసమే 10లక్షల ఉద్యోగులపై వేటు: నారా లోకేశ్

మరో 16మంది పేర్లను కూడా పోలీసులకు అందించిన ఫిర్యాదులో వీఆర్వో దుర్గారావు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీనిపై విచారణ జరుపుతున్నట్లు వారు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నట్లు తేలితే కేసులు నమోదుచేయనున్నట్లు పోలీసులు తెలిపారు. 

చట్టవ్యతిరేకంగా జాతీయ రహదారిని దిగ్బందించడం వల్లే ఈ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 144 సెక్షన్, 30పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నా పట్టించుకోకుండా వాహనాల రాకపోకలకు అంతరాయం కల్గించి ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే వీరు చేసిన  నేరంగా పేర్కొన్నారు. పోలీసులు చెప్పినా పట్టించుకోకుండా విధులకు ఆటంకం కల్గించారని ఎఫ్ఐఆర్ లో పేర్కోన్నారు. 

read more  నిరుద్యోగులకు శుభవార్త... 15,971 ఉద్యోగాల భర్తీకి సీఎం ఆదేశం