జగన్ కు జాతకాల పిచ్చి... అందుకోసమే కేసీఆర్ తో భేటీ: బైటపెట్టిన జవహర్
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ ల భేటీపై మాాజీ మంత్రి, టిడిపి నాయకులు కేఎస్ జవహర్ సంచలన కామెంట్స్ చేశారు.
అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాతకాల పిచ్చితో ఇటు హిందువులను, అటు క్రైస్తవులను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి, టిడిపి నాయకులు కెఎస్.జవహర్ ఆరోపించారు. స్వరూపానంద సరస్వతి సలహాతోనే రాజధానిని విశాఖకు మార్చేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని... అందుకోసం ఐదు కోట్ల ఆంధ్రులను ఇబ్బందులకు గురిచేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ప్రజల కష్టాలు, సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. కేవలం కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు రాజధాని కోసం మూకుమ్మడి రాజీనామాలు చేస్తే ముఖ్యమంత్రి దిగిరాక తప్పదన్నారు.
read more పిన్నెల్లి హత్యకు చంద్రబాబు కుట్ర: అంబటి రాంబాబు
శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతుల దగ్గరకు కుట్రలో భాగంగానే వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వచ్చారని పేర్కొన్నారు. బూతులు మాట్లాడటంలో మంత్రి కొడాలి నానిని మించిపోయిన పిన్నెల్లి నోరు కడుక్కోవడానికి ఈసారి యాసిడ్ పంపిస్తానని జవహర్ పేర్కొన్నారు.
ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేయాల్సింది పోయి మాచర్ల నియోజకవర్గ ప్రజలను పిన్నెల్లి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మగతనం గురించి మాట్లాడుతున్న వైసీపీ నేతలు దమ్ముంటే ఉద్దండరాయుని పాలెంలో చర్చకు రావాలన్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని జవహర్ హెచ్చరించారు.
read more కేసీఆర్ కే సాధ్యం కాలేదు... జగన్ కు ఎలా సాధ్యమవుతుంది: సోమిరెడ్డి
రాజధాని ప్రాంతంలో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగితే హోంమంత్రి సుచరిత, ఎమ్మెల్యే రోజా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని... ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజల్ని గందరగోళానికి గురిచేస్తున్నారని అన్నారు. అమ్మఒడి పథకం ప్రకటనలో మంత్రి ఆదిమూలపు సురేష్ ఫోటో ఎందుకు పెట్టలేదో సమాధానం చెప్పాలన్నారు. హైదరాబాద్‌కు మేలు చేసే విధంగా మరో ఒప్పందం చేసుకునేందుకే తెలంగాణ సీఎం కేసీఆర్‌తో జగన్మోహన్ రెడ్డి భేటీ అవుతున్నారని ఆరోపించారు.
ఐదు కోట్ల ఆంధ్రులకు మద్దతుగా రాజధాని కోసం పోరాడుతున్న నారా లోకేష్‌ను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఒక దళిత ఎమ్మెల్యే అయి ఉండీ అంబేద్కర్ ను గుర్తించలేని స్థితిలో ఎమ్మెల్యే శ్రీదేవి ఉండటం సిగ్గుచేటన్నారు. అధికారపార్టీ నేతలు బూతులు మానేసి బాధత్యగా వ్యవహరించాలని... ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టడం సమంజసం కాదని జవహర్ సూచించారు.