విశాఖలో 39వేల ఎకరాలు కబ్జా... ఎక్కడ బయపడతాయో అనే...: కాల్వ శ్రీనివాసులు

విశాఖలో చంద్రబాబు పర్యటనను అడ్డుకోడానికి ముఖ్యమంత్రి జగన్ అక్కడ చేసిన భూకబ్జాలే కారణమని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు.

kalva srinivasulu allegation on YSRCP leaders and CM YS Jagan

గుంటూరు: వైజాగ్ లో చంద్రబాబు నాయుడు పర్యటనను  జగన్ అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. కేవలం 9 నెలల్లోనే వైసిపి నాయకులు విశాఖ చుట్టుపక్కల సుమారు 39వేల ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల భూములను ప్రభుత్వమే కబ్జా చేయడం దుర్మార్గమని విమర్శించారు. 

ఏకంగా ముఖ్యమంత్రి జగనే చేస్తున్న భూ కుంభకోణాలు ఎక్కడ బయటపడతాయో అన్న భయంతో చంద్రబాబు నాయుడు వైజాగ్ పర్యటనను అడ్డుకోవడం సిగ్గు చేటని అన్నారు. అంతేకాకుండా కోడిగుడ్లు, టమోటాలు, చెప్పులు విసిరేందుకు వైసీపీ రంగం సిద్ధం చేయడం జగన్ ఫ్యాక్షన్ మనస్తత్వానికి అద్దం పడుతుందని ఆరోపించారు.  

read more  విశాఖలో నేడు జరిగింది ట్రైలర్ మాత్రమే... అసలు సినిమా ముందుంది..: వర్ల రామయ్య సంచలనం

చంద్రబాబుపై కోడిగుడ్లు, టమాటాలు విసరాలని మనిషికి 500 రూపాయలు ఇచ్చి వైసిపి కార్యకర్తలను ఆటోల్లో తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయన్నారు. వైకాపా మహిళా కార్యకర్తలకు వాళ్లే పసుపు చీరలు పంపిణీ చేసి టీడీపీ కార్యకర్తల ముసుగులో చెలరేగాలని చేసిన ప్రయత్నం దారుణమని మండిపడ్డారు. 

పెందుర్తి మండలంలోని పెంటవాని చెరువు దగ్గర రెండు రోజుల నుంచి దారికి అడ్డంగా కందకం తొవ్వుతుంటే పోలీసులు ఎందుకు వారిపై చర్యలు తీసుకోలేదు...? అని ప్రశ్నించారు. జగన్ పర్యటన సమయంలో టిడిపి నాయకులు, కార్యకర్తలను గృహ నిర్బంధాలు పెట్టడం, కేసులు పెట్టి పోలీసు స్టేషన్ లో ఉంచటం చేశారని... మరి చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో ఎందుకు వైసీపీ నాయకులను గృహ నిర్బంధం చేయడం లేదు?  అని కాల్వ పోలీసులను, ప్రభుత్వాన్ని నిలదీశారు.   

read more  చంద్రబాబుపై కార్యకర్తలను ఉసిగొల్పింది ఆ మంత్రులే...: అమర్‌నాథ్ రెడ్డి   

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios