రాజధాని కోసం ఆమరణ నిరాహాదీక్షకు సిద్దం: మాజీ మంత్రి ప్రకటన
ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆమరణ నిరాహార దీక్షకు సిద్దమని ప్రకటించారు.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ కు పూర్తిస్థాయి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెనుకాడబోనని హెచ్చరించారు. రాజధాని, భూములిచ్చిన రైతులు, ప్రజల కోసం ఎంతవరకయినా పోరాడేందుకు సిద్దమేనని మాజీ మంత్రి తెలిపారు.
ముఖ్యమంత్రి మూడు రాజధానులు ప్రకటనపై పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ పూలింగ్ చేసి అమరావతిలో రాజధాని మొదలుపెట్టామని... చట్ట బద్ధత కల్పించిన రాజధానిని ఎలా మారుస్తారని ప్రశ్నించారు. అమరావతి నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... తనతో పాటు టిడిపి అండగా వుంటామని భరోసా ఇచ్చారు.
ఇప్పటికే పదివేల కోట్లు ఖర్చుపెట్టి అమరావతిలో వివిధ అభివృద్ది పనులు ప్రారంభించామని.... వైసిపి ప్రభుత్వం అదికారాన్ని చేపట్టగానే వాటిని ఆపేశారని అన్నారు. దీంతో దాదాపు 50,000 మంది కార్మికులు ఉపాధి కోల్పోయి ఇక్కడి నుండి వెళ్లిపోయారని అన్నారు.
read more వారివల్ల జగన్ అస్తిత్వానికే ముప్పు... అందుకే రాజధాని మార్పు: జవహర్
''ఓ పక్క మునిగిపోతుంది అంటారు..మరో పక్క రాజధాని ఇక్కడే అంటారు. వైసీపీ మంత్రులు అనాలోచితంగా మాట్లాడొద్దు. చెన్నై, ముంబై రాజధానులకి సముద్రాలు లేవా...అవి మునిగిపోయాయా. మంత్రులు పిచ్చి ప్రేలాపనలు ఇకనైనా ఆపాలి. రైతులు కోర్టుకి వెళ్తే మీ ప్రభుత్వం లక్షకోట్లపైగా పెనాల్టీ కట్టాల్సివస్తుంది... కట్టే దమ్ము ఉందా..." అంటూ పుల్లారావు వైసిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
మరో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ... రాజధానిగా అమరావతి అందరికి అనువైన ప్రాంతమన్నారు. రాజధాని అభివృద్ధి చేయలేకపోవడం జగన్ చేతకాని తనమేనని... ఇక్కడున్న అతి పెద్దకులం రైతు కులమని అన్నారు.
read more జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కేశినేని నాని... సెటైరికల్ గా
వైసీపీ మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని... అమరావతిని స్మశానంతో, కుక్కలు, పందులతో పోల్చడం ఆపాలన్నారు. రాజధానిపై వేసింది జిఎన్ రావు కమిటీనా లేక జగన్మోహన్ కమిటీనా అని ఎద్దేవా చేశారు. పెట్టుబడి లేకుండా ఇక్కడ రాజధాని అభివృద్ధి చేయవచ్చు కదా అని అన్నారు.
సౌత్ ఆఫ్రికా నేరాలలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. ఈ రాష్ట్రాన్ని కూడా నేరాల్లో మొదటి స్థానంలో ఉంచడమే జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. హైకోర్టు కర్నూల్ లో ఉండటం వల్ల అధికారులందరూ హైదరాబాద్ లోనే నివాసం వుంటారని... దీంతో ఆ ప్రాంత అభివృద్ది జరగదన్నారు. అలాకాకుండా కర్నూల్ లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కొల్లు రవీంద్ర సూచించారు.